నిర్ణీత షెడ్యూల్‌కే శశికళ జైలు నుంచి విడుదల అవుతారా?

అన్నాడీఎంకేలో కుర్చి వివాదం సమసిపోయింది.. మొన్నటి వరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంలు ఇద్దరూ సీఎం అభ్యర్థి నేనంటేనేనంటూ తగవులాడుకున్నారు కదా!

నిర్ణీత షెడ్యూల్‌కే శశికళ జైలు నుంచి విడుదల అవుతారా?
Follow us

|

Updated on: Oct 09, 2020 | 12:27 PM

అన్నాడీఎంకేలో కుర్చి వివాదం సమసిపోయింది.. మొన్నటి వరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంలు ఇద్దరూ సీఎం అభ్యర్థి నేనంటేనేనంటూ తగవులాడుకున్నారు కదా! ఆ తర్వాత ఇద్దరూ రాజీకొచ్చేశారు.. సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని ప్రకటిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు పన్నీర్‌సెల్వం.. ఈ ఇద్దరూ ఒక్కటయ్యేసరికి చిన్నమ్మ శశికళ పరిస్థితి ఏమిటా అన్న అనుమానం కలిగింది చాలా మందికి! అసలు శశికళ సకాలంలో జైలు నుంచి బయటకు వస్తారా? ఇంకాస్తా లేటవుతుందా? ఇదే అనుమానాలను అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం పార్టీ వర్గాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి.. శశికళ జైలు నుంచి బయటకు రాకుండా కుట్ర జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. ఒకదాని తర్వాత మరొకటి జప్తు నోటీసులు రావడం వెనుక ఇదే కుతంత్రం ఉందని ఆరోపిస్తున్నారు పార్టీ నేతలు.. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు శశికళ. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో ఆమె శిక్షాకాలం ముగుస్తుంది..పది కోట్ల జరిమానా చెల్లించి జైలు నుంచి బయటకు రావడం ఖాయమని చిన్నమ్మ శిబిరం ఎంతో ఆశతో ఉంది.. దినకరన్‌ కూడా ఈ ఏర్పాట్లలో ఉన్నారు.. ఇదిలా ఉండగానే శశికళ అక్రమంగా ఆర్జించారంటూ ఆస్తుల అటాచ్‌, షోకాజ్‌ నోటీసులు ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నాయి.. ఇప్పటికే ఐటీ రెండు విడతలుగా ఆస్తులను జప్తు చేసింది.. ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్‌ చేసింది.. సిరుదాపూర్‌ బంగ్లా, కొడనాడు ఎస్టేట్‌లలో ఐటీ డిపార్ట్‌మెంట్‌ నోటీసులను కూడా అంటించింది.. అమ్మ వారసులుగా దీప, దీపక్‌లను కోర్టు ప్రకటించిన నేపథ్యంలో , వారికి కూడా షోకాజ్‌ నోటీసులు పంపడం గమనించదగ్గ విషయం.. ఇప్పటి వరకు ఐటీ 3,900 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది.. శశికళ విడుదలను ఎలాగైనా సరే అడ్డుకోవాలన్న తలంపుతోనే ఇదంతా జరుగుతుందన్నది అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజకం ఆరోపణ. ఎన్నికల తర్వాతే విడుదల చేయాలనే కుట్ర జరుగుతుందని అంటోంది.. ఈ ఆస్తుల అటాచ్‌లు, ఈ షోకాజ్‌ నోటీసులు అందుకేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు..

Latest Articles
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!