‘అమ్మకు నెగెటివ్ వచ్చింది.. హమ్మయ్య…’ఆమిర్ ఖాన్

తన తల్లికి కరోనా వైరస్ నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తెలిపాడు. ఇందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఊరట చెందానని ఆయన బుధవారం ట్వీట్ చేశాడు. ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలని, మీ ప్రార్థనలు ఫలించాయని తన అభిమానులను ఉద్దేశించి పేర్కొన్నాడు. తన తల్లి జీనత్ హుసేన్ ని కరోనా టెస్టింగ్ కి తీసుకువెళ్తున్నట్టు ఆమిర్ ఖాన్ నిన్న ట్వీట్ చేశాడు. కాగా నాతో బాటు నా […]

'అమ్మకు నెగెటివ్ వచ్చింది.. హమ్మయ్య...'ఆమిర్ ఖాన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 01, 2020 | 3:35 PM

తన తల్లికి కరోనా వైరస్ నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తెలిపాడు. ఇందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఊరట చెందానని ఆయన బుధవారం ట్వీట్ చేశాడు. ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలని, మీ ప్రార్థనలు ఫలించాయని తన అభిమానులను ఉద్దేశించి పేర్కొన్నాడు. తన తల్లి జీనత్ హుసేన్ ని కరోనా టెస్టింగ్ కి తీసుకువెళ్తున్నట్టు ఆమిర్ ఖాన్ నిన్న ట్వీట్ చేశాడు. కాగా నాతో బాటు నా కుటుంబ సభ్యులకు కూడా కరోనా నెగెటివ్ రిపోర్టు వఛ్చినట్టు ఇదివరకే స్పష్టం చేశా అని ఆయన తెలిపిన సంగతి విదితమే. ఆమిర్ స్టాఫ్ సభ్యుల్లో కొంతమందికి కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే వారిని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది  క్వారంటైన్ కి తరలించారు. ఆమిర్ ఫ్లాట్ కాంప్లెక్సునంతటినీ శానిటైజ్ చేశారు. నా స్టాఫ్ త్వరలో కోలుకుంటారని ఆశిస్తున్నా అని ఈ నటుడు పేర్కొన్నాడు.