Viral Video: డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. నాటకంలో భాగమే అనుకున్న ప్రేక్షకులు.. ఊహించని విధంగా

|

Sep 08, 2022 | 5:48 PM

పార్వతి వేషంలో నృత్యం చేస్తున్న కళాకారుడిని మృత్యువు కాటేసింది. జమ్మూలోని (Jammu) కోటి సోనియా గ్రామంలో జాగరణ్‌ కార్యక్రమంలో భాగంగా పార్వతి వేషంలో ఓ కళాకారుడు స్టేజ్‌పై డాన్స్‌ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. గుండెపోటుతో..

Viral Video: డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. నాటకంలో భాగమే అనుకున్న ప్రేక్షకులు.. ఊహించని విధంగా
Dacne Collapse Video Viral
Follow us on

పార్వతి వేషంలో నృత్యం చేస్తున్న కళాకారుడిని మృత్యువు కాటేసింది. జమ్మూలోని (Jammu) కోటి సోనియా గ్రామంలో జాగరణ్‌ కార్యక్రమంలో భాగంగా పార్వతి వేషంలో ఓ కళాకారుడు స్టేజ్‌పై డాన్స్‌ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. గుండెపోటుతో ఆ కళాకారుడు చనిపోయాడు. శివుడిని పార్వతి ప్రసన్నం చేసుకునే సీన్‌లో భాగంగా ఆ కళాకారుడు డాన్స్‌ చేస్తున్నాడు. అతని పేరు యోగేష్ గుప్తా. చాలా చక్కగా స్టేజ్‌పై డాన్స్‌ చేశాడు. కాని ఆకస్మాత్తుగా కుప్పకూలాడు. నిర్వాహకులు అతడిని రక్షించే ప్రయత్నం చేశారు. కాని సాధ్యం కాలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లాక డాక్టర్లు యోగేష్ గుప్తాకు వైద్య పరీక్షలు చేశారు. అప్పటికే గుండెపోటుతో అతడు చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది. ఈ క్లిప్ లో ఓ వ్యక్తి పార్వతీ దేవి వేషం వేసుకుని ప్రదర్శన ఇస్తున్నాడు. గణేష్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ వేడుక జరుగుతోంది. అతను డ్యాన్స్ (Dance) చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మరో విషయం ఏమిటంటే అతను కింద పడిపోయినప్పుడు కూడా అది నాటకంలో భాగమేనని ప్రేక్షకులు భావించారు. కొంత సమయం గడిచిన తర్వాత కూడా అతను లేవకపోయే సరికి వెంటనే అప్రమత్తమై పైకి లేపేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయినా లాభం లేకపోవడంతో వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తరలించారు.

ఇంతకుముందు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కేకే కోల్‌కతాలో సంగీత కచేరీలో పాల్గొన్న సమయంలో చనిపోవడం దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. స్టేజ్ పై కుప్పకులిపోయిన సమయంలో ప్రేక్షకులు వెంటనే అప్రమత్తమై సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మలయాళ గాయకుడు బషీర్ మే 28న ఒక ప్రదర్శనలో వేదికపై కుప్పకూలారు. బషీర్ కేరళలో ఆర్కెస్ట్రాను ప్రాచుర్యంలోకి తెచ్చారు. అతడిని ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే మరణించినట్లు ప్రకటించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి