Viral News: మందులు బాబులు చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నిసార్లు వాళ్లు చేసే పనులు చూస్తుంటే నవ్వాలో, తిట్టాలో అర్థం కాదు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. తాజాగా చెన్నైలో ఇలాంటి ఓ సంఘటనే జరిగింది. ఓ తాగుబోతు చేసిన పనికి విమానమే ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి కుటుంబీకులు శనివారం దుబాయ్ వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. అయితే అతనికి మాత్రం తన కుటుంబీకులు వెళ్లడం ఇష్టం లేదు. దీంతో ఎలాగైనా ప్రోగ్రామ్ క్యాన్సల్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం ఓ ప్లాన్ వేశాడు.
అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించిన ఆ వ్యక్తి.. ఎలాగైనా ప్రోగ్రామ్‌ను క్యాన్సల్ చేయాలని భావించిన ఆ మందు బాబు ఏకంగా ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందికి ఫోన్ చేసి దుబాయ్ వెళ్తోన్న విమానంలో బాంబ్ ఉందని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కాల్ చేసింది ఎవరనీ ఆరా తీయగా సదరు తాగుబోతు పోలీసులకు దొరికిపోయాడు. ఇదంతా ఎందుకు చేశావని ప్రశ్నించగా.. దుబాయ్‌కి వెళ్లకుండా ఆపేందుకే ఇలా చేశానని చావు కబురు చల్లగా చెప్పాడు. దీంతో పోలీసులు అతగాడి ఆన్సర్ విని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..