మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో బిచ్చగాడు చేసిన పని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ బిచ్చగాడు తన భార్యకు మోటార్‌సైకిల్‌ను బహుమతిగా ఇచ్చాడు. బిచ్చగాడు సంతోష్ సాహు 90 వేల రూపాయలతో మోపెడ్ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసి తన భార్య మున్నీకి ఇచ్చాడు. సంతోష్ సాహు మీడియాతో మాట్లాడుతూ ఇంతకుముందు మాకు ట్రైసైకిల్ ఉండేది. కానీ, తర్వాత అతని భార్య అనారోగ్యానికి గురైంది. తీవ్రమైన వెన్నుతో బాధపడుతోంది. అందుకోసమే తాను తన భార్య కోసం ఈ మోపెడ్‌ను రూ.90 వేలుపెట్టి కొనుగోలు చేశాడు.
మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో భిక్షాటన చేస్తూ జీవించే సంతోష్ సాహు పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అతను నిజమైన ప్రేమకు ఉదాహరణగా నిలిచాడు. భార్య సమస్య దృష్ట్యా భిక్షాటన చేసి వచ్చిన డబ్బుతో మోపెడ్ కొనుగోలు చేశాడు. అంతకు ముందు వారు ట్రై సైకిల్‌పై భిక్షాటన చేసేవారు. మరి మోపెడ్‌తో ఎలా అడుక్కుంటారు…? అసలు సంతోష్ సాహు కథ ఏంటో ఇప్పడు చేద్దాం..
మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన బిచ్చగాడు సంతోష్ సాహు వికలాంగుడు. అతని భార్య మున్నీ సాయంతో ఇద్దరూ కలిసి ఓ ట్రైసైకిల్‌పై ప్రయాణిస్తూ బిక్షాటన చేసేవారు. అతడు ట్రైసికిల్‌పై కూర్చుంటే, అతని భార్య సైకిల్ తోసుకుంటూ బిక్షం అడిగుతుండేది..అయితే, ఇటీవల సంతోష్ సాహూ భార్య అనారోగ్యానికి గురైంది. సంతోష్ కుమార్ సాహు తన భార్య చికిత్స కోసం 50 వేల రూపాయలు ఖర్చు చేశాడు. చికిత్స అనంతరం కోలుకున్న బలహీనంగా తయారైంది. దాంతో ఆమె ట్రై సైకిల్‌ని తోయలేకపోతోంది. భార్య కష్టం చూడాలేక ఆ బిచ్చగాడు చలించిపోయాడు. ఎలాగైన తన భార్య కోసం ఓ బైక్ కొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే 90 వేల రూపాయలతో మోపెడ్ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసి తన భార్య మున్నీకి బహుమతిగా అందించాడు. మోటార్ సైకిల్‌తో తన భార్యకు ట్రైసైకిల్ తోయాల్సిన పనిలేదని చెబుతున్నాడు. ఇద్దరం కలిసి హాయిగా బైక్‌పైనే వెళ్లి అడుకొచ్చాని చెబుతున్నారు. అంతేకాదు, ఇద్దరం కలిసి సియోని, ఇటార్సి, భోపాల్, ఇండోర్‌లకు కూడా వెళ్లొచ్చని చెబుతున్నాడు. పైగా, బైక్ కొన్న తర్వాత ఆ బిచ్చగాడు వెళ్లి తనకు సాయం చేసిన వారికి మిఠాయిలు పంచాడు. అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
సుమారు 4 సంవత్సరాల పాటు బైక్ కోసం ఒక్కోరూపాయి దాచిపెట్టానని చెబుతున్నాడు సంతోష్ సాహు. ఇప్పుడు హాయిగా భార్యను వెనక కూర్చోబెట్టుకుని భిక్షం ఎత్తుకుంటున్నామని చెబుతున్నాడు. సంతోష్, అతని భార్య భిక్షాటనలో రోజుకు 300-400 రూపాయలు సంపాదిస్తామని చెబుతున్నారు.. భిక్షాటనలో వారికి రెండు పూటలా ఆహారం కూడా లభిస్తుంది.
#WATCH A beggar, Santosh Kumar Sahu buys a moped motorcycle worth Rs 90,000 for his wife Munni in Chhindwara, MP
Earlier, we had a tricycle. After my wife complained of backache, I got this vehicle for Rs 90,000. We can now go to Seoni, Itarsi, Bhopal, Indore, he says. pic.twitter.com/a72vKheSAB
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 24, 2022
ఇకపోతే, గతంలో చింద్వారా వీధుల్లో బార్‌కోడ్‌లో డబ్బులు తీసుకున్న బిచ్చగాడు కూడా వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు అడిగి ద్విచక్ర వాహనాలు కొన్న బిచ్చగాళ్ల జంట కూడా చర్చనీయాంశమైంది.