Lawyers Write to letter CJI Bobde: దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేయడంతోపాటు పలు చర్యలు చేపట్టింది. ఈ చర్యలపై 140 మంది న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేకు బుధవారం లేఖ రాశారు.
సింఘు, ఘాజీపూర్, టిక్రీ బోర్డర్లల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించడంపై న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం అందరికీ ఇంటర్నెట్ చాలా అవసరమని.. ఈ సేవలపై ఆంక్షలు విధించడమంటే.. ప్రాథమిక హక్కులు, జీవించే హక్కును హరించడమేనని పేర్కొన్నారు. ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై సుమోటోగా విచారణ చేపట్టాలని కోరారు. దీంతోపాటు సేవలు పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అలాగే రైతులపై స్థానికుల దాడి, బోర్డర్లల్లో బారికేడ్ల ఏర్పాటు, తదితర ఘటనలపై దర్యాప్తు చేయాలని కోరారు.
జనవరి 26 హింసాత్మక ఘటనల అనంతరం ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ రైతు శిబిరాల పరిధిలో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ టెలికం ఆపరేటర్లను ఈ నెల 30న ఆశించింది. మొదట ఆదివారం రాత్రి వరకు నెట్ సేవలపై నిషేధం విధించగా తాజాగా మళ్లీ దానిని పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read:
Rahul Gandhi: నియంతల పేర్లన్నీ ‘ఎం’ అక్షరంతోనే మొదలవుతున్నాయి.. రాహుల్ గాంధీ సంచలన ట్విట్..