Viral: భూమిని తవ్వతుండగా గట్టిగా వినిపించిన శబ్ధం.. ఏంటా అని వెలికితీయగా అద్భుతం

|

Jul 28, 2022 | 8:53 PM

గ్రామంలోని కూలీలు రోజూలానే తమ పనుల్లో భాగంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ చోట గడ్డపారతో తవ్వుతుండగా.. అరుదైన విగ్రహం బయల్పడింది.

Viral: భూమిని తవ్వతుండగా గట్టిగా వినిపించిన శబ్ధం.. ఏంటా అని వెలికితీయగా అద్భుతం
Representative Image
Follow us on

Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బుద్గామ్‌ జిల్లా(Budgam district)లో 2 పురాతన శిల్పాలు బయటపడ్డాయి. అందులో ఒకటి  విష్ణుమూర్తి విగ్రహం అని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నిర్ధారించింది. వివరాల్లోకి వెళ్తే.. బుద్గామ్‌లోని గుడ్‌సథూ గ్రామం(Gudsathoo village)లోని వ్యక్తులు ఓ స్థలంలో తవ్వకాలు జరుపుతుతండగా.. ఓ శిల్పం కనిపించింది. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిల్పాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించారు.  ఆర్కియాలజీ, మ్యూజియంల శాఖ బృందాన్ని పిలిపించి విగ్రహాన్ని పరిశీలించగా,  ఆ శిల్పం విష్ణుమూర్తిది అని తేలింది. ఈ విగ్రహం దాదాపు 9వ శతాబ్దానికి చెందినదని.. దాదాపు 1,200 సంవత్సరాల నాటిదని వారు ఒక నిర్ధారణకు వచ్చారు.  ఈ శిల్పం మూడు తలలతో.. నాలుగు చేతులతో ఉంది. విగ్రహం కుడి చేయి ఎగువ భాగంలో కమలం ఉంది. అదే విధంగా బుద్గాంలోని ఖాగ్ ప్రాంతంలో మరో శిల్పాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ శిల్పం పంచముఖ శకలమని అధికారులు తెలిపారు. ఈ రెండు శిల్పాలను కాశ్మీర్‌లోని  ఆర్కియాలజీ, మ్యూజియంల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ముస్తాక్ అహ్మద్ బేగ్‌కు అందజేసినట్లు బుద్గామ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తాహిర్ సలీమ్ ఖాన్ తెలిపారు. (Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం..