నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన భవనం..

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నోయిడాలోని సెక్టార్ 11లో బహుళ అంతస్తుల భవనం ఒకటి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవన నిర్మాణం పనులు కొనసాగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భవన శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన భవనం..
Follow us

|

Updated on: Jul 31, 2020 | 10:25 PM

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  నోయిడాలోని సెక్టార్ 11లో బహుళ అంతస్తుల భవనం ఒకటి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవన నిర్మాణం పనులు కొనసాగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భవన శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. రెస్య్కూ ఆపరేషన్ సిబ్బంది సాయంతో ఇప్పటి వరకు నలుగురిని రక్షించారు. వీరిలో ముగ్గురు పురుషులు కాగా, ఒకరు మహిళ ఉన్నట్లు తెలిపిన పోలీసులు.. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సెక్టార్ 24 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 11లో ఉన్న ఎఫ్ 62లో భవన నిర్మాణం కొనసాగుతోంది. అయితే, ఒక్కసారి భవనం కూలిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేపట్టారు.