సింధియాతోనే మేం.. ఆరుగురు మాజీ మంత్రుల క్లారిటీ.. రిలీజైన వీడియో

ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా రాజీనామాలు చేసిన ఆరుగురు మంత్రులూ..  రాజీనామా తాము  తీసుకున్న సొంత నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిడీ లేదన్నారు.

సింధియాతోనే మేం.. ఆరుగురు మాజీ మంత్రుల క్లారిటీ.. రిలీజైన వీడియో
Jyotiraditya Scindia Facebook Hack
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 12, 2020 | 12:13 PM

ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా రాజీనామాలు చేసిన ఆరుగురు మంత్రులూ..  రాజీనామా తాము  తీసుకున్న సొంత నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిడీ లేదన్నారు. ఈ మేరకు ఎవరికి వారు విడివిడిగా వీడియోలు రిలీజ్ చేశారు. సింధియా ఢిల్లీలో బీజేపీలో చేరిన వెంటనే ఇవి విడుదలై వైరల్ అయ్యాయి.  తులసీ శిలావత్, గోవింద్ రాజ్ సింగ్ పుత్, మహేంద్ర సింగ్ శిశోడియా, ఇమార్తి దేవి, ప్రభురాం చౌదరి, ప్రద్యుమ్న సింగ్ తోమర్ అనే ఈ ఆరుగురూ తాము కమల్ నాథ్ ప్రభుత్వంతో టచ్ లో ఉన్నామని వఛ్చిన వార్తలను తోసిపుచ్చారు. (సింధియా శిబిరంలోని  మంత్రుల చేత మోసపూరితంగా రాజీనామాలు చేయించారని, బెంగుళూరులో ఉన్న వీరు తమ ప్రభుత్వంతో టచ్ లో ఉన్నారని కమల్ నాథ్ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే).

కానీ ఈ ప్రకటనను ఖండించిన ఈ మాజీ మంత్రులు.. తమతో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు తమతో బాటు కలిసికట్టుగా ఉన్నారని, ఎవరి ఒత్తిడీ వీరిపై లేదని ఆరోగ్య శాఖ మంత్రి తులసీ శిలావత్ తన వీడియోలో స్పష్టం చేశారు. మేమంతా జ్యోతిరాదిత్య సింధియా అడుగుజాడల్లో నడుస్తాం.. ఆయన నిర్ణయం మాకు శిరోధార్యం అన్నారు. అలాగే మహేంద్ర సింగ్ శిశోడియా.. నిజానికి సింధియా ఎవరికీ ద్రోహం చేయలేదని, ఆయనకే కాంగ్రెస్ పార్టీతో బాటు కమల్ నాథ్ కూడా ద్రోహం చేశారని అన్నారు. సింధియా కృషి వల్లే 15 ఏళ్ళ అనంతరం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగిందని ఆయన పేర్కొన్నారు. ఇతర మాజీ  మంత్రులు కూడా ఇదే విధమైన అభిప్రాయాలతో  తమ వీడియోలను విడుదల చేశారు.

కాగా ఈ ఆరుగురితో సహా 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగుళూరులో ఉండగా..ఇతరులు వివిధ చోట్ల ఉన్నారు. వీరంతా రాజీనామాలు చేశారు.

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..