Breaking News
  • భారత్‌లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 28,637 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
  • అమరావతి మండలం ముత్తాయపాలెం బ్యాంక్ ని మోసం చేసిన కేసులో ఉన్నతాధికారులు సీరియస్. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని ఏవిధంగా ప్రభుత్వానికి విక్రయించారంటూ ఆరా తీస్తున్న అధికారులు. ఇప్పటికే ప్రారంభమయిన పోలీసు దర్యాప్తు.
  • విజయవాడ: ఆత్రేయపురం ప్రేమకథ సినిమా పేరుతో మోసం. చైతన్య క్రియేషన్ బ్యానర్ పై సినిమా అంటూ యువతులకు వల. అమరావతి శివక్షేత్రంలో సినిమా ప్రారంభం అంటూ రిబ్బన్ కటింగ్ చేసిన గుంటూరు జిల్లాకు చెందిన రెంవత్ బిక్షా . విజయవాడ, గుంటూరు జిల్లాకు చెందిన యువతులను హీరోయిన్లుగా చేస్తానంటూ చీటింగ్.
  • తిరుపతి.... డయిల్ యువర్ ఈఓ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్.... శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకుంటాం. నిధులు దుర్వినియోగం కానీయం. నెలరోజుల్లో 16.73 కోట్లు శ్రీవారికి హుండీ ద్వారా ఆదాయం లభించింది.
  • రాజ్ భవన్ లో రాపిడ్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. మొత్తం 395 మందికి టెస్ట్ నిర్వహిస్తే.... 347 మంది నెగిటివ్. రాజ్ భవన్ లో భద్రతా విధులు నిర్వహిస్తున్న 28 మంది పోలీసులకు పాజిటివ్.... వారిని ఇసొలేషన్ కి పంపించాం. మరో పదిమంది సిబ్బందికి, పదిమంది రాజ్ భవన్ సిబ్బంది కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ గా తేలింది. 20 మందిని ని ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ చేర్పించడం జరిగింది. గవర్నర్ కి కరోనా నెగిటివ్ వచ్చింది.
  • లష్కరే తోయబా టాప్ టెర్రరిస్ట్ ఉస్మాన్ ను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ
  • సీఎం కెసిఆర్: ఇరిగేషన్ శాఖ పై రివ్యూ నిర్వహించిన సీఎం కేసీఆర్. కమలాపూర్ జడ్పిటిసి భూమయ్య, రైతు శ్రీపాల్ రెడ్డి లను ప్రత్యేకంగా ఆహ్వానించిన సీఎం. అన్ని ప్రాజెక్టుల పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలి. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల పుష్కలంగా నీటి లభ్యత ఏర్పడింది. అవసరమైతే నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలి. తెలంగాణలో చెరువులు చెక్డ్యాంలు ఎప్పుడూ నిండి ఉండాలి. ఎస్సారెస్పీ ప్రాజెక్టు లో ఎప్పుడూ 25 నుంచి 30 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచాలి.

ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే.. మాతృభాష చదవాల్సిందేనట.!

Mother Tongue Mandatory For Government Jobs, ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే.. మాతృభాష చదవాల్సిందేనట.!

Mother Tongue Mandatory For Government Jobs: ఈ మధ్యకాలంలో విద్యార్థులు తమ మాతృభాషను మర్చిపోతున్న నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే స్థానిక అస్సామీ భాష 10వ తరగతి వరకు తప్పనిసరిగా చదవాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హిమనంత్‌ బిశ్వ శర్మ వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

అటు లోయ ప్రాంతంలోని బోడోల్యాండ్‌ టెర్రిటోరియల్‌ అటానమస్‌ జిల్లాల్లోనూ అక్కడి స్థానిక భాష బెంగాలీ, బోడోలు తప్పకుండా 10వ తరగతి వరకు అభ్యసించాలని ప్రకటించారు. ఇక దీనిపై రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపగా.. బడ్జెట్ సమావేశాల సమయంలో బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని మంత్రి తెలిపారు. తన పిల్లలు ఇతర రాష్ట్రాల్లో చదువుతున్నారని.. అందువల్ల వారు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు అనర్హలని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు విద్యా వ్యవస్థకు కావాల్సిన మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు మంత్రి హిమనంత్‌ బిశ్వ శర్మ స్పష్టం చేశారు. సుమారు 24,000 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాక 1వ తరగతి నుంచి 8 తరగతి వరకు చదువుతున్న స్టూడెంట్స్‌కు నాలుగు జతల యూనిఫాంలను.. అలాగే 9,10 తరగతి విద్యార్థులకు రెండు జతలను ప్రభుత్వం ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Mother Tongue Mandatory For Government Jobs, ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే.. మాతృభాష చదవాల్సిందేనట.!

Related Tags