Farmers Protest: జైజవాన్, జైకిసాన్ నినాదాలతో, ఢిల్లీ బోర్డర్లలోకి మళ్ళీ చేరుతున్న అన్నదాతలు.

ఈ నెల 26 న రిపబ్లిక్ దినోత్సవం నాడు ఢిల్లీ అల్లర్లు, ఎర్రకోట ముట్టడి ఘటనల తరువాత కాస్త స్తబ్దంగా ఉన్న రైతులు తిరిగి యాక్టివ్ అయ్యారు. యూపీ తదితర రాష్ట్రాలనుంచి..

Farmers Protest: జైజవాన్, జైకిసాన్ నినాదాలతో, ఢిల్లీ బోర్డర్లలోకి మళ్ళీ చేరుతున్న అన్నదాతలు.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 31, 2021 | 5:33 PM

ఈ నెల 26 న రిపబ్లిక్ దినోత్సవం నాడు ఢిల్లీ అల్లర్లు, ఎర్రకోట ముట్టడి ఘటనల తరువాత కాస్త స్తబ్దంగా ఉన్న రైతులు తిరిగి యాక్టివ్ అయ్యారు. యూపీ తదితర రాష్ట్రాలనుంచి అనేకమంది మళ్ళీ సింఘు, ఘాజీపూర్, తిక్రి బోర్డర్లకు చేరుతున్నారు. కిసాన్ ఏక్తా జిందాబాద్, జై జవాన్, జైకిసాన్ అని నినాదాలు చేస్తూ కదులుతున్నారు.  ఈ బోర్డర్లలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నప్పటికీ వారు చలించడం లేదు. యూపీ నుంచి వస్తున్న అన్నదాతల్లో కొందరు.. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ కన్నీరు పెట్టడాన్ని వీడియోలో చూసిన తాము తిరిగి నిరసనల్లో పాల్గొనేందుకు వస్తున్నట్టు తెలిపారు.  ఈ నెల 29 న  తన నిరసన స్థలం నుంచి ఖాళీ చేసేందుకు నిరాకరించిన తికాయత్ కన్నీటి పర్యంతమైన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక అనేకమంది రైతులు వారాల తరబడి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రైతుల నిరసన మొదలై నేటికీ 67 వ రోజుకు చేరుకుంది.

ఇలా ఉండగా సింఘు సరిహద్దుల్లో ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో ఈ నెల 26 న ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఓ రైతు మృతి చెందిన ఘటనపై వెబ్ పోర్టల్ దాఖలు చేసిన ట్వీట్ ను షేర్ చేసినందుకు ‘ది వైర్’ ఎడిటర్ సిధ్ధార్థ్ వరదరాజన్ పై పోలీసు కేసు నమోదైంది.