Culture And Language: మోడీకి త‌మిళ ప్ర‌జ‌ల‌పైన‌, భాష‌పైన ఏ మాత్రం గౌర‌వం లేదు… కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్ గాంధీ…

త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌పైన‌, త‌మిళ భాష‌పైన, సంస్కృతిపైన ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి ఏమాత్రం గౌర‌వం లేద‌ని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు....

Culture And Language: మోడీకి త‌మిళ ప్ర‌జ‌ల‌పైన‌, భాష‌పైన ఏ మాత్రం గౌర‌వం లేదు... కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్ గాంధీ...
Follow us

| Edited By:

Updated on: Jan 23, 2021 | 2:21 PM

త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌పైన‌, త‌మిళ భాష‌పైన, సంస్కృతిపైన ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి ఏమాత్రం గౌర‌వం లేద‌ని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. త‌మిళ ప్ర‌జ‌ల‌ను, భాష‌ను, సంస్కృతిని త‌న సిద్ధాంతాల‌కు, ప‌ద్ధ‌తుల‌కు అనుగుణంగా ఉప‌యోగించుకోవాల‌ని మోదీ భావిస్తున్నార‌ని ఆయ‌న‌ విమ‌ర్శించారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న కోసం త‌మిళ‌నాడుకు వెళ్లిన రాహుల్‌గాంధీ కోయంబ‌త్తూర్ రోడ్ షోలో పాల్గొని కేంద్ర స‌ర్కారుపైన‌ విమ‌ర్శ‌లు చేశారు. మోడీ న్యూ ఇండియా దృష్టి కోణంలో త‌మిళ‌నాడు ప్ర‌జ‌లను దేశంలో రెండో త‌ర‌గ‌తి ప్ర‌జ‌లుగా చూస్తున్నార‌ని రాహుల్‌గాంధీ ఆరోపించారు. దేశంలో ర‌క‌ర‌కాల భాష‌లు, సంస్కృతులు ఉన్నాయ‌ని, త‌మిళం, హిందీ, బెంగాలీ, ఆంగ్లం ఇలా అన్ని భాష‌ల‌ను మ‌నం గౌర‌వించుకోవాల‌ని రాహుల్ తెలిపారు.