అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ట్రావెన్ కోర్ బోర్డ్ సంచలన నిర్ణయం..

ట్రావెన్ కోర్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి శబరిమల అయ్యప్పస్వామి ఆలయం గర్భగుడి సమీప ప్రాంతంలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు దేవస్వోమ్‌ బోర్డు.. బుధవారం ప్రకటించింది. గతకొద్ది రోజులుగా.. సోషల్ మీడియాలో శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి సంబంధించిన గర్భగుడి చిత్రాలు, ఆలయ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు.. వైరల్‌ కావాడంతో.. దేవస్వోమ్ బోర్డు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్ప మాలధారులు పవిత్రంగా భావించే 18 బంగారు మెట్ల వద్ద (పాతినేట్టం […]

అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ట్రావెన్ కోర్ బోర్డ్ సంచలన నిర్ణయం..
Follow us

| Edited By:

Updated on: Dec 05, 2019 | 6:06 AM

ట్రావెన్ కోర్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి శబరిమల అయ్యప్పస్వామి ఆలయం గర్భగుడి సమీప ప్రాంతంలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు దేవస్వోమ్‌ బోర్డు.. బుధవారం ప్రకటించింది. గతకొద్ది రోజులుగా.. సోషల్ మీడియాలో శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి సంబంధించిన గర్భగుడి చిత్రాలు, ఆలయ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు.. వైరల్‌ కావాడంతో.. దేవస్వోమ్ బోర్డు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్ప మాలధారులు పవిత్రంగా భావించే 18 బంగారు మెట్ల వద్ద (పాతినేట్టం పడి), గర్భాలయ ముందు భాగంలో (తిరు ముత్తం), ఆలయ చుట్టు పక్కల ప్రదేశాల్లో మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ.. బోర్డు సమావేశంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భక్తులు మెట్ల మార్గానికి చేరుకోగానే.. ఫోన్లను స్విచ్చ్ ఆఫ్ చేసుకోవాలని సూచించారు. మొబైల్ నిషేధం ఆదేశాలను ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని.. మొబైల్ ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్ చేయకుండా అలానే ఉంటే.. ఆ ఫోన్లను సీజ్ చేస్తామని తెలిపింది.

కాగా, నవంబరు 16 మొదలైన వార్షిక మండల పూజకు.. ఇప్పటికే పెద్ద ఎత్తున అయ్యప్ప మాల ధారులు శబరిమల చేరుకుంటున్నారని.. డిసెంబరు 3వ తేదీ వరకు.. దాదాపు ఏడు లక్షల మందికిపైగా భక్తులు.. స్వామి వారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.