సినిమా థియేటర్లకు.. మంత్రి తలసాని షాకింగ్ ట్విస్ట్

హైదరాబాద్ నగరంలోని సినిమా థియేటర్లలో టికెట్ల ధరలు పెంచిన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. టికెట్ ధరలు పెంచేందుకు థియేటర్ల యాజమాన్యాలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. మహర్షి సినిమా విడుదల నేపథ్యంలో… సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 టికెట్ ధర రూ. 110కి పెంచినట్లు, మల్టీఫ్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.50, ప్రసాద్ ఐమ్యాక్స్‌లో రూ.138 రూపాయలున్న ఒక్కో టికెట్ ధరను రూ.200 పెంచినట్లు థియేటర్ […]

సినిమా థియేటర్లకు.. మంత్రి తలసాని షాకింగ్ ట్విస్ట్
Follow us

| Edited By:

Updated on: May 07, 2019 | 9:53 PM

హైదరాబాద్ నగరంలోని సినిమా థియేటర్లలో టికెట్ల ధరలు పెంచిన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. టికెట్ ధరలు పెంచేందుకు థియేటర్ల యాజమాన్యాలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.

మహర్షి సినిమా విడుదల నేపథ్యంలో… సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 టికెట్ ధర రూ. 110కి పెంచినట్లు, మల్టీఫ్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.50, ప్రసాద్ ఐమ్యాక్స్‌లో రూ.138 రూపాయలున్న ఒక్కో టికెట్ ధరను రూ.200 పెంచినట్లు థియేటర్ యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వ అనుమతితోనే పెంచినట్లు థియేటర్ల యాజమాన్యాలు చెప్పినప్పటికీ మంత్రి తలసాని మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ప్రకటించడంతో ఈ వ్యవహారంపై గందరగోళం నెలకొంది.