Breaking News
  • మధ్యప్రదేశ్ లో ఒకే ఇంట్లో 8 మందికి కరోనా పాజిటివ్. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా లో ఒకే ఫ్యామిలీ లో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడి. గతం లో ఒక ఇంటి సభ్యుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వెల్లడించిన అధికారులు. అన్ని కూడా కాంటాక్ట్ కేస్ లు.
  • కరోనా నేపథ్యంలో ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు. బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో 20 కరోనా హాట్‌స్పాట్ ప్రాతాలను పూర్తిగా సీల్ చేయనున్న ప్రభుత్వం. నిత్యావసర సరుకులను ఇళ్లకే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. వైద్య అవసరాలకు తప్ప హాట్‌స్పాట్ ప్రాంతాల వారు బయటకు వెళ్లేది లేదంటూ నిషేధాజ్ఞలు. ఈ ప్రాంతాల వారు బయటకు రాకుండా, ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా పోలీసుల పర్యవేక్షణ.
  • చెన్నై విలుపురంలో కరోనా పాజిటివ్ వ్యక్తి ఐసోలేషన్ వార్డు నుండి పరారీ. గతనెలలో విలుపురం వచ్చిన ఢిల్లీకి చెందిన వ్యక్తి. కరోనా పాజిటివ్ తెలియగానే కలెక్టరేట్ లో‌ని ఐసోలేషన్ వార్డు నిండి పరారీ. ఆ వ్యక్తి ఆచూకి తెలపాలంటూ పోటో విడుదల చేసిన పోలీసులు.
  • కరోనా నేపథ్యంలో ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు. బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో 20 కరోనా హాట్‌స్పాట్ ప్రాతాలను పూర్తిగా సీల్ చేయనున్న ప్రభుత్వం. నిత్యావసర సరుకులను ఇళ్లకే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. వైద్య అవసరాలకు తప్ప హాట్‌స్పాట్ ప్రాంతాల వారు బయటకు వెళ్లేది లేదంటూ నిషేధాజ్ఞలు. ఈ ప్రాంతాల వారు బయటకు రాకుండా, ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా పోలీసుల పర్యవేక్షణ.
  • తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ. విద్యుత్ సంస్థలు రీలివ్ చేసిన ఉద్యోగుల జీతాల చెల్లింపుపై నెలకొన్న సందిగ్ధతపై సుప్రీంకోర్టులో అప్లికేషన్ వేసిన ధర్మాధికారి కమిటీ. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు .

దారుణంః అక్క‌పైనే క‌న్నేసిన త‌మ్ముడు..వీడిని ఏం చేయాలి..

క‌ర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వావివ‌రుస‌లు మ‌ర్చిపోయిన ఓ కామాంధుడు రెచ్చిపోయి మృగంలా మారాడు. అక్క‌పైనే క‌న్నేసిన కామాంధుడు..ఆమెను చెర‌బ‌ట్టాడు. బాధితురాలు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది...
married woman raped by brother in kurnool district, దారుణంః అక్క‌పైనే క‌న్నేసిన త‌మ్ముడు..వీడిని ఏం చేయాలి..

దారుణం: క‌ర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వావివ‌రుస‌లు మ‌ర్చిపోయిన ఓ కామాంధుడు రెచ్చిపోయి మృగంలా మారాడు. అక్క‌పైనే క‌న్నేసిన కామాంధుడు..ఆమెను చెర‌బ‌ట్టాడు. బాధితురాలు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. వివ‌రాల్లోకి వెళితే…

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని నాగలూటి చెంచుగూడెంలో ఈ దారుణ సంఘ‌ట‌న జ‌రిగింది. బాధితురాలి భ‌ర్త‌కు కొద్ది రోజులుగా ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో స్థానిక ఆస్ప‌త్రిలో చూపించింది. మంగళవారం మరోసారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటో కోసం బయటకు వెళ్లింది. ఈ క్ర‌మంలోనే ఆమెపై ఎప్పటినుంచో కన్నేసిన అదే గూడెంకు చెందిన ఓ యువకుడు ఆమెకు మాయ‌మాట‌లు చెప్పి ఆటో తాను చూపిస్తానని నమ్మించాడు. వరుసకు తమ్ముడే కావడంతో ఆమె అతడి మాటలు నమ్మి బయల్దేరింది. ఇదే అదునుగా దుర్మార్గుడు ఆమెను నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. విష‌యం స్థానికులు చెప్పినా ఎవ‌రూ ఆమెను మాట‌ను లెక్క‌చేయ‌లేదు. పైగా రాత్రివేళ అత‌డితో బైక్‌పై ఎందుకు వెళ్లావ‌ని తన‌నే నిందించారట‌.

మ‌ర్నాడు భ‌ర్త‌తో పాటు ఆస్ప‌త్రికి వెళ్లిన బాధితురాలి ప‌రిస్థితి గ‌మ‌నించిన వైద్యులు ఆమెకు కూడా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టింది బాధితురాలు. భార్య‌భ‌ర్త‌లిద్ద‌రినీ మెరుగైన చికిత్స కోసం ఆత్మ‌కూరు ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. విష‌యం తెలుసుకున్న‌గూడెం పెద్ద‌లు ఇరు కుటుంబాల మధ్య రాజీకుదిర్చే దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. కాగా, నిందితుడు గ‌తంలోనూ ఓ మ‌హిళ‌పై అత్యాచారం చేసి హ‌త్య‌చేశాడ‌ని, ఆ కేసులో జైలుకు కూడా వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. బాధితురాలి వాగ్మూలం మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Related Tags