Breaking News
  • రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. చాలా మందిలో కరోనా సోకినా లక్షణాలు ఉండటంలేదని అధ్యయనంలో వెల్లడి కావడంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
  • ముంబై దాదార్‌లోని శుష్రుషా ఆస్పత్రి నర్సులందరినీ క్వారంటైన్‌కు తరలింపు. ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో చర్యలు. కొత్తగా రోగులెవరినీ చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేసిన అధికారులు. ఇప్పటికే ఉన్న రోగులను 48 గంటల్లో డిశ్చార్జి చేయాలని ఆదేశాలు. క్వారంటైన్ చేసిన నర్సులందరికీ కరోనా టెస్టులు చేయాల్సిందిగా ఆదేశం.
  • కరోనా నుంచి పూర్తిగా కొలుకోక ముందే కొత్తగూడెం డిఎస్పీ డిశ్చార్జి.. అదే పేరుతో ఉన్న మరోవ్యక్తికి నెగిటివ్ రావటం తో డిఎస్పీ డిశ్చార్జి.. రిపోర్టులో డిఎస్పీకి పాజిటివ్ అని తేలటంతో మళ్ళీ వెనక్కి రప్పిస్తున్న వైద్యులు.. నిన్న ఇంటికి వెళ్లినా డిఎస్పీ క్వారంటైన్ లొనే ఉన్నారు..
  • కరోనాతో బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ కుట్ర. కుట్రను భగ్నం చేసిన బిహార్ పోలీసులు. నేపాల్ సరిహద్దుల ద్వారా కరోనా పాజిటివ్ ఉగ్రవాదులను భారత్‌కు పంపే అవకాశం. తద్వారా వైరస్ విస్తృతి చేయాలన్నది పాక్ కుట్రగా అనుమానం.
  • కరోనా ని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాయమందించిన మై హోం గ్రూప్. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి 3 కోట్ల రూపాయల చెక్ ని అందించిన మై హోం ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరక్టర్ జూపల్లి రంజిత్ రావు.

నాడు అలిగిన మన్మోహన్… రాజీనామాకు రెడీ….అడ్డు పడిన ఆహ్లువాలియా

manmohan singh asked me if he should resign in 2013 says montek singh ahluwalia, నాడు అలిగిన మన్మోహన్… రాజీనామాకు రెడీ….అడ్డు పడిన ఆహ్లువాలియా

మిస్టర్ కూల్.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో అలిగి రాజీనామాకు సిధ్ధపడ్డారట. యూపీఏ-2 హయాంలో అప్పటి ప్రభుత్వం తెచ్చిన ఓ జీవోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చించి వేయడమే ఆయన ఆగ్రహానికి కారణమైందట. వివరాల్లోకి వెళ్తే.. అది 2013 సంవత్సరం. అప్పట్లో అవినీతి ఆరోపణల మచ్ఛపడిన ఎంపీలకు రెండేళ్ల జైలుశిక్ష విధించాలని సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పు నేపథ్యంలో.. నాటి ప్రభుత్వం ఓ ఆర్డినెన్సును తెచ్చింది. అయితే వివాదాస్పదమైన ఈ ఆర్డినెన్స్ పూర్తి అర్థరహితమైనదని, చించి.. పారవేయదగినదని రాహుల్ అభివర్ణించారట. దీనివల్ల తమ ప్రభుత్వం ఇరకాట పరిస్థితినెదుర్కొనవచ్ఛునని  భావించి  ఆయన ఈ వ్యాఖ్యలు చేశారట.  ఆ సమయానికి మన్మోహన్ సింగ్ అమెరికాలో ఉన్నారు. ఒకప్పటి ప్లానింగ్ కమిషన్ (ప్రణాళికా సంఘం) ఉపాధ్యక్షుడైన మాంటెక్ సింగ్ ఆహ్లువాలియా ఈ విషయాలన్నీ తన  పుస్తకంలో రాశారు. ‘బ్యాక్ స్టేజ్.. ది స్టోరీ.. బిహైండ్ ఇండియాస్ హై  గ్రోత్ ఇయర్స్’ అనే పుస్తకమిది ! నాడు మన్మోహన్ తో బాటు న్యూయార్క్ వెళ్లిన ప్రతినిధి బృందంలో తానూ  ఉన్నానని, అక్కడ ఉండగా తన సోదరుడు, మాజీ ఐఏఎస్ అధికారి కూడా అయిన సంజీవ్…. మన్మోహన్ ను విమర్శిస్తూ రాసిన ఓ ఆర్టికల్ ను తనకు ఈ-మెయిల్ చేయగా ..దాన్ని మన్మోహన్ కు చూపానని ఆహ్లువాలియా తెలిపారు. ఇది చదివిన మన్మోహన్ రాజీనామాకు సిధ్ధపడ్డారని పేర్కొన్నారు. ఆర్డినెన్స్ జీవోను చించివేయాలని అన్నారంటే అది ప్రధానమంత్రి కార్యాలయాన్ని అవమానించడమేనని.. అంటే తనను అవమానించినట్టేనని మన్మోహన్ భావించారని ఆయన తెలిపారు. అయితే ఈ ఆలోచన మంచిది కాదని తాను సలహా ఇచ్చానని, దీంతో ఆయన వెనక్కి తగ్గారని ఆహ్లువాలియా వివరించారు. మన్మోహన్ సింగ్ తిరిగి ఢిల్లీకి వఛ్చిన అనంతరం ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది.

యూపీఏ-2 హయాంలో పలువురు మంత్రులపై వఛ్చిన అవినీతి ఆరోపణల గురించి, పాలసీ వైఫల్యాల గురించి ఆహ్లువాలియా ఈ బుక్ లో పేర్కొన్నారు. నాటి పలు  ప్రభుత్వ పథకాలు ఈయన వల్లే పాపులర్ అవుతూ వచ్చాయి.manmohan singh asked me if he should resign in 2013 says montek singh ahluwalia, నాడు అలిగిన మన్మోహన్… రాజీనామాకు రెడీ….అడ్డు పడిన ఆహ్లువాలియా

 

Related Tags