ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. ఇకపై వీసా లేకుండానే మలేషియా చుట్టేయచ్చు..!

సహజంగా ఇతర దేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టుతో పాటు వీసా తప్పనిసరి. కొన్నిసార్లు వీసా ఆలస్యం కావడం వల్ల ప్రయాణాలు కూడా ఆగిపోతుంటాయి. అయితే ఈ బెడద లేకుండా భారతీయులకు కొత్త సంవత్సరం కానుకగా మలేషియా బంపరాఫర్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే టూరిస్టు భారతీయులు ఇకపై ఎటువంటి వీసా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదివరకు ఉన్న వీసా నిబంధనను రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీసా లేకుండా 2020 చివరి వరకు […]

ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. ఇకపై వీసా లేకుండానే మలేషియా చుట్టేయచ్చు..!
Follow us

|

Updated on: Jan 04, 2020 | 11:46 AM

సహజంగా ఇతర దేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టుతో పాటు వీసా తప్పనిసరి. కొన్నిసార్లు వీసా ఆలస్యం కావడం వల్ల ప్రయాణాలు కూడా ఆగిపోతుంటాయి. అయితే ఈ బెడద లేకుండా భారతీయులకు కొత్త సంవత్సరం కానుకగా మలేషియా బంపరాఫర్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే టూరిస్టు భారతీయులు ఇకపై ఎటువంటి వీసా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదివరకు ఉన్న వీసా నిబంధనను రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీసా లేకుండా 2020 చివరి వరకు తమ దేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాల్ని చుట్టేయచ్చునని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకపై మలేషియాకు సులభంగా వెళ్లే అవకాశం ఉంది.

ప్రొసీజర్ ఎలాగంటే…

*ఆన్‌లైన్ ద్వారా మొదట పేరును నమోదు చేసుకుని.. మూడు నెలలోపు అక్కడికి వెళ్ళాలి.

*వెళ్లిన రోజు నుంచి 15 రోజులు మాత్రమే పర్యటించే అవకాశం ఉంటుంది.

*ఇక మరోమారు వెళ్లాలంటే 45 రోజుల తర్వాతే సాధ్యమవుతుంది

కాగా, ఈ నిబంధనను పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అమలు చేసినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా సమ్మర్ హాలిడేస్‌కు టూర్ ప్లాన్ చేసుకోవాలనుకునే వారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.