తప్పిన పెనుప్రమాదం.. లాక్‌డౌన్ డ్యూటీలో ఉన్న తహసీల్దార్‌పైకి దూసుకెళ్లిన లారీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌ డ్యూటీలో ఉన్న ఎమ్మార్వోకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తహసీల్దార్‌తో పాటు అతని సిబ్బంది పైకి ఒక్కసారిగా లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంతో తహసీల్దార్‌తో పాటు గిర్థవర్‌కు..

తప్పిన పెనుప్రమాదం.. లాక్‌డౌన్ డ్యూటీలో ఉన్న తహసీల్దార్‌పైకి దూసుకెళ్లిన లారీ
Follow us

| Edited By:

Updated on: May 15, 2020 | 1:44 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌ డ్యూటీలో ఉన్న ఎమ్మార్వోకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తహసీల్దార్‌తో పాటు అతని సిబ్బంది పైకి ఒక్కసారిగా లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంతో తహసీల్దార్‌తో పాటు గిర్థవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉన్న చెక్‌పోస్ట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా అశ్వారావుపేట శివారులో రెవెన్యూ, పోలీస్, వైద్య సిబ్బంది చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్ర జిల్లాల నుంచి వచ్చే వలస కూలీలు ప్రయాణికుల వివరాలను నమోదు చేసుకుని స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జంగారెడ్డి గూడెం వైపు వెళ్తోన్న ఓ లారీ అదుపుతప్పి చెక్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎమ్మార్వో ప్రసాద్, గిర్దవర్‌గా పని చేస్తున్న వెంకటేశ్వరరావు, పశ్చిమ బెంగాల్ వలస కూలీల మేస్త్రి ముజాహిద్దీన్ గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం వల్ల అక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడి, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Read More:

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపా? సడలింపా?