Breaking News
 • నెల్లూరు: సైదాపురం తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ సస్పెన్షన్‌. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చంద్రశేఖర్‌తో పాటు.. వీఆర్‌వోతో, తహశీల్దార్‌ ఆఫీస్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌.
 • టీవీ9కు అవార్డుల పంట. ఎక్సేంజ్‌ ఫర్‌ మీడియా న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అవార్డుల్లో.. టీవీ9కు మూడు అవార్డులు. పుల్వామా దాడి కవరేజ్‌కు బెస్ట్ న్యూస్ కవరేజ్ అవార్డు అందుకున్న.. విజయవాడ బ్యూరో చీఫ్‌ హసీనా. మరో రెండు విభాగాల్లో టీవీ9కు అవార్డులు. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ కార్యక్రమానికి.. సౌత్‌ ఇండియాలోనే బెస్ట్‌ యాంకర్‌గా రజినీకాంత్‌కు అవార్డు. టీవీ9 టాస్క్‌ఫోర్స్‌ బ్లాక్‌మ్యాజిక్‌ కార్యక్రమానికి మరో అవార్డు. అద్రాస్‌పల్లిలోని 'చితిపై మరో చితి' బాణామతి కథనానికి.. బెస్ట్‌ లేట్‌ ప్రైమ్‌టైం షో అవార్డు.
 • కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన కేంద్రం. స్థానికుల ప్రయోజనాలను కాపాడుతామని హామీ. త్వరలో ప్రత్యేక హోదా స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తాం -కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌.
 • రామానాయుడు స్టూడియోలో ప్రెషర్‌ కుక్కర్‌ సినిమా చూసిన కేటీఆర్‌. ప్రెష్‌ ఎనర్జీ, మంచి మెసేజ్‌తో సినిమా ఉంది. డాలర్‌ డ్రీమ్స్‌ కోసం అందరూ అమెరికాకు పరుగులు పెడుతున్నారు. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్ధమయ్యేలా సినిమా తీశారు-మంత్రి కేటీఆర్‌.
 • తూ.గో: కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో విద్యుత్‌షాక్‌తో మామిడి శ్రీను అనే వ్యక్తి మృతి.
 • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 56,837 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు.

బడ్జెట్ లో పెరిగిన‌వి… తగ్గిన‌వి?

List, బడ్జెట్ లో పెరిగిన‌వి… తగ్గిన‌వి?

2019-20సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌లో పెట్రోల్, డీజీల్, బంగారం, ఆటోపార్ట్స్ ధరలు, ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్, సీసీ టీవీ కెమెరా, జీడి పప్పు, ఇంపోర్టెడ్ పుస్తకాలు, పీవీసీ, ఫినాయిల్ ఫ్లోరింగ్, టైల్స్‌, మెటల్‌ ఫిట్టింగ్‌, ఫర్నిచర్‌, సింథటిక్ రబ్బర్‌, మార్బుల్ ల్యాప్స్‌,, డిజిటల్‌ వీడియో రికార్డర్స్‌ ధరలు పెరగనున్నాయి. కాగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంటి రుణాలు, తోలు ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. సెల్యులార్ మొబైల్ ఫోన్స్‌లోని కెమెరా మాడ్యూల్, చార్జర్, అడాప్టర్‌లపై కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు మరింత తగ్గనున్నాయి. తాజా బడ్జెట్‌ వివిధ వస్తువుల ధరలపై ప్రభావవం చూపనుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలతో ధరలు పెరిగే, తగ్గే వస్తువులివి!

ధరలు పెరిగేవి…

 •  బంగారం
 •  పెట్రోల్‌ డీజిల్‌
 •  ఏసీలు
 •  స్టోన్‌ క్రషింగ్‌ ప్లాంట్‌లు
 •  సీసీ కెమెరాలు
 •  స్పీకర్లు
 •  డిజిటల్‌ వీడియో రికార్డర్లు
 • ఆటో మొబైల్‌లో వినియోగించే
  షీట్లు, రోల్స్‌, డిస్క్‌లు, ప్యాడ్‌లు
 •  కార్ల అద్దాలు, రేర్‌ వ్యూ గ్లాస్‌
 • మోటార్‌ బైక్‌లకు వేసే తాళాలు
 • ఆయిల్‌/ఎయిర్‌ ఫిల్టర్‌లు
 • సిరామిక్‌ టైల్స్‌
 • స్టెయిన్‌లెస్‌ స్టీల్‌
 • అలాయ్‌ స్టీల్‌ వైర్‌
 • సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విపత్తు నిధి పన్ను
 • జీడి పిక్కలు
 •  సబ్బులు
 • ప్లాస్టిక్‌ ఫ్లోర్‌ కవర్లు
 •  రబ్బరు
 •  టైర్లు
 •  న్యూస్‌ ప్రింట్‌
 •  మ్యాగజైన్లు
 •  దిగుమతి చేసుకునే పుస్తకాలు
 • ఆప్టికల్ ఫైబర్‌ కేబుళ్లు
 •  మెటల్‌ ఫర్నిచర్‌
 • పీవీసీ పైపులు
 • బైక్‌ హార్న్‌లు
 • లైటింగ్‌ సిస్టమ్‌
 • కార్ల విండో స్క్రీన్‌ వైపర్‌

ధరలు తగ్గేవి…

 • గృహ రుణాలు
 • సెల్‌ఫోన్‌ ఛార్జర్లు
 • సెట్‌టాప్‌ బాక్సులు
 • మొబైల్‌ ఫోన్లలో వినియోగించే లిథియం బ్యాటరీలు
 • ఎలక్ట్రిక్‌ కారులు, బైక్‌లు, ఛార్జింగ్‌ సైకిళ్లు
 • రక్షణ సామగ్రి
 • నాఫ్తా

Related Tags