Telugu News Lifestyle You will get more benefits with black carrots than orange carrots and can resist cancer
Health Tips: ఈ క్యారెట్ తింటే చాలు.. క్యాన్సర్‌ని మీ దరిదాపులకు కూడా రాకుండా అరికట్టవచ్చు..
బరువు పెరగడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో క్యారెట్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అలాగే శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు క్యారెట్ల నుంచి లభిస్తాయి. అయితే మనం తినే క్యారెట్లు ఆరెంజ్ రంగులో ఉంటాయి. కానీ క్యారెట్లు నలుపు..
క్యారెట్‌తో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడంలో అలాగే బరువు పెరగడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో క్యారెట్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అలాగే శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు క్యారెట్ల నుంచి లభిస్తాయి. అయితే మనం తినే క్యారెట్లు ఆరెంజ్ రంగులో ఉంటాయి. కానీ క్యారెట్లు నలుపు రంగులో కూడా ఉంటాయని మీకు తెలుసా..? నిజంగానే నల్లగా కూడా ఉంటాయి. ఆరెంజ్ క్యారెట్ల కంటే ఎక్కువ మొత్తంలో పోషకాలు, ప్రయోజనాలును కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇవి బరువు తగ్గడంలో, క్యాన్సర్‌ని నిరోధించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంకా నల్ల క్యారెట్లతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం..
నల్ల క్యారెట్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
నల్ల క్యారెట్లలో ఉండే ఆంథోసైనిన్ అనే పదార్థం.. మన శరీరానికి క్యాన్సర్ కణాలతో పోరాడేందుకు కావాల్సిన శక్తిని ఇస్తుంది.
ఆరెంజ్ క్యారెట్లలో ఉన్నట్టే నల్ల రంగు క్యారెట్‌లలో కూడా ఉండే బీటా కెరాటిన్.. మన కంటి చూపును మెరుగుపరిచి, కంటి కణాలకు రక్షణ కల్పిస్తుంది.
నల్ల క్యారెట్లలో ఉండే పీచు పదార్థం ఆరోగ్యవంతమైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవ్వడమేగాక శరీరంలోని కొవ్వు తగ్గుతుంది.