
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.. అందుకే డాక్టర్లు సైతం రోజూ ఏదో ఒక పండు తినమని సలహా ఇస్తుంటారు. అయితే అందరూ అన్ని పండ్లను ఒకేలా ఇష్టపడరు. కొందరికి మామిడి పండ్లంటే పిచ్చి.. మరికొందరికి అరటిపండ్లు లేదా ఆపిల్స్ అంటే ఇష్టం. అయితే మీరు తినడానికి ఇష్టపడే పండు కేవలం మీ రుచిని మాత్రమే కాదు.. మీ మనసులోని అసలు వ్యక్తిత్వ రహస్యాలను కూడా బయటపెడుతుందని మీకు తెలుసా? ఆప్టికల్ ఇల్యూజన్స్ లేదా శరీర ఆకృతి ఆధారంగా పర్సనాలిటీ టెస్టులు చేసినట్లే.. మనకు ఇష్టమైన పండ్ల ఎంపిక ఆధారంగా కూడా మన స్వభావం ఎలా ఉంటుందో సైకాలజిస్టులు చెబుతున్నారు. మరి మీకు ఇష్టమైన పండు మీ గురించి ఏం చెబుతుందో ఇప్పుడే తెలుసుకోండి..
నారింజ పండును అమితంగా ఇష్టపడే వ్యక్తులు సాధారణంగా చాలా సహనంతో, నమ్మకస్తులుగా ఉంటారు. వీరు అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. ప్రతి విషయంలోనూ చాలా గంభీరంగా, లోతుగా ఆలోచించిన తర్వాతే ముందడుగు వేస్తారు.
అరటిపండు సానుకూలతకు, ఆశావహ దృక్పథానికి ప్రతీక. మీకు అరటిపండు ఇష్టమైతే, మీరు చాలా దయగల వారని అర్థం. అందరితో స్నేహపూర్వకంగా, మర్యాదగా ప్రవర్తిస్తారు. అయితే మీకున్న ఈ మంచి స్వభావాన్ని ఆసరాగా చేసుకుని కొందరు తమ స్వార్థం కోసం మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రమాదం ఉంది.. కాస్త జాగ్రత్త.
పండ్ల రాజా మామిడిని ఇష్టపడేవారు కొంచెం మొండిగా ఉంటారు. అయితే వీరి మొండితనంలో ఒక లాజిక్ ఉంటుంది. వీరు ప్రతి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి, హేతుబద్ధంగా తీసుకుంటారు. అనుకున్నది సాధించే వరకు వదలరు.
ఆపిల్ ప్రియులు ఫిట్‌నెస్, ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వీరి జీవితంలో క్రమశిక్షణ అనేది ఒక ముఖ్యమైన భాగం. వీరు బహిర్ముఖులు, అందరితో చాలా సులభంగా కలిసిపోతారు. ఏ పనినైనా ఉత్సాహంతో చేస్తూ, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.
బేరిపండ్లను ఇష్టపడే వ్యక్తులు చాలా చురుకుగా ఉంటారు. కానీ వీరికి సహనం కొంచెం తక్కువ. చాలా సులభంగా చికాకు పడతారు.. కోపం కూడా అంతే వేగంగా వస్తుంది. అయినప్పటికీ, లోపల ఎలాంటి కల్మషం లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.
చెర్రీ పండును ఇష్టపడేవారు సాధారణంగా అంతర్ముఖులు, కాస్త సిగ్గు స్వభావం కలవారు. తమ గురించి తాము బహిరంగంగా మాట్లాడుకోవడానికి ఇష్టపడరు. అయితే వీరు చాలా సరళ మనస్కులు. ఎవరినీ త్వరగా అనుమానించరు, ఎవరైనా తప్పు చేసినా సులభంగా క్షమించే గుణం వీరి సొంతం.
ఎండకాలంలో అమృతం లాంటి పుచ్చకాయను ఇష్టపడే వ్యక్తులు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరిలో సృజనాత్మకత చాలా ఎక్కువ. అంతేకాదు, వీరు చాలా తెలివైన వారిగా సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు.
దానిమ్మను ఇష్టపడేవారు హెల్తీ లైఫ్‌స్టైల్‌ను ఎక్కువగా కోరుకుంటారు. వీరి ఆలోచనా విధానం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది. ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే ఓర్పు, సహనం వీరిలో మెండుగా ఉంటాయి.
పైనాపిల్ ఇష్టపడే వ్యక్తుల్లో కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. కాస్త ఆవేశపూరిత స్వభావం ఉన్నప్పటికీ, నిరంతరం ఉత్సాహంతో దూసుకుపోతారు. వేరివరిపైనా ఆధారపడకుండా స్వయం సమృద్ధిగల జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు.