ఈ పండ్లు తింటే కడుపులో అసిడిటీ పెరుగుతుందట..! కాస్త చూస్కోండి..

కొన్ని పండ్లు అతిగా తినడం వల్ల కలిగే సమస్యల్లో ఆమ్లత్వం ఒకటి. నిజానికి ఇదొక సాధారణ సమస్య. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. అయితే కొంతమంది ఆరోగ్యకరమైనవిగా భావించే పండ్లను తిలిసో తెలియక తినడం వల్ల చిక్కుల్లోపడతారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరగడానికి..

ఈ పండ్లు తింటే కడుపులో అసిడిటీ పెరుగుతుందట..! కాస్త చూస్కోండి..
Acidic Fruits To Avoid For Your Health

Updated on: Feb 12, 2026 | 11:37 AM

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేస్తాయి. ఇందులో అతిగా తినడం వల్ల కలిగే సమస్యల్లో ఆమ్లత్వం ఒకటి. నిజానికి ఇదొక సాధారణ సమస్య. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. అయితే కొంతమంది ఆరోగ్యకరమైనవిగా భావించే పండ్లను తిలిసో తెలియక తినడం వల్ల చిక్కుల్లోపడతారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరగడానికి బదులుగా హాని పెరుగుతుంది. ఆమ్లత్వంతో బాధపడేవారు ఏ పండ్లను నివారించాలో? అసలెందుకు వాటిని తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

నారింజ

ఆమ్లత్వం ఉన్నవారు నారింజ పండ్లను నివారించాలి. ఇవి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు అయినప్పటికీ వాటిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నారింజ తినడం వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ పెరుగుతాయి.

నిమ్మ

మీకు అసిడిటీ ఉంటే నిమ్మకాయను కూడా తీసుకోకూడదు. ఇందులో బలమైన గ్యాస్ట్రిక్ ఆమ్లం ఉంటుంది, ఇది ఆమ్లతను మరింత తీవ్రతరం చేస్తుంది, ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకుంటే.

ఇవి కూడా చదవండి

పైనాపిల్

అసిడిటీ సమస్య ఉన్నవారు పైనాపిల్ కూడా తినకూడదు. హెల్త్‌లైన్ ప్రకారం ఇందులో సిట్రిక్ యాసిడ్, బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటాయి. ఇది కడుపు ఆమ్లాన్ని పెంచుతుంది. గుండెల్లో మంటను కలిగిస్తుంది.

మామిడి

ఆయుర్వేదం ప్రకారం పచ్చి మామిడి తినడం కూడా తీవ్ర అమ్లత్వాన్ని కలిగిస్తుంది. ఇందులో సిట్రిక్, మాలిక్, ఆక్సాలిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి పిత్తాన్ని తీవ్రతరం చేస్తాయి. ఇది గుండెల్లో మంట, ఆమ్లత్వానికి దారితీస్తుంది.

జామ

జామపండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వాటిలో గట్టి విత్తనాలు కూడా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి అవి హానికరం. వీటి అజీర్ణం కారణంగా ఆమ్లతను మరింత తీవ్రతరం చేస్తాయి.

ద్రాక్ష

ద్రాక్ష యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. వీటిని తీసుకోవడం వల్ల పిత్తం పెరుగుతుంది. వీటిలో అధిక మొత్తంలో సిట్రిక్, టార్టారిక్ ఆమ్లాలు ఉంటాయి. ఈ ఆమ్లాలు కడుపు ఆమ్లాన్ని మరింత పెంచుతాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో వీటిపి తీసుకుంటే గుండెల్లో మంట వస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us