Curd Benefits: ఎప్పుడు పడితే అప్పుడు పెరుగు తింటే ఏం జరుగుతుంది..? ఈ విషయం తెలియకపోతే ప్రమాదమే..

వ్యాయామం వల్ల అధికంగా చెమట పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే పెరుగు తింటే జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. ఉదయాన్నే ఓ కప్పు పెరుగు తింటే మెటబాలిజం పెరుగుతుంది. ఎనర్జీగా ఉంటారు. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణశక్తిని పెంచి గట్ హెల్త్‌ని కాపాడుతుంది. ఇందుకోసం హోల్ గ్రెయిన్స్, సెరల్స్‌తో కలిపి తీసుకోవచ్చు. అయితే,

Curd Benefits: ఎప్పుడు పడితే అప్పుడు పెరుగు తింటే ఏం జరుగుతుంది..? ఈ విషయం తెలియకపోతే ప్రమాదమే..
Curd Benefits

Updated on: May 14, 2025 | 8:41 PM

పెరుగును ఎప్పుడు పడితే అప్పుడు తింటే జలుబు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. పెరుగు చల్లని గుణం కలిగి ఉండటం వల్ల, దానిని ఉదయం లేదా మధ్యాహ్నం భోజనంలో తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం భోజనంలో పెరుగు తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుది. ముఖ్యంగా శరీరంలో వేడి ప్రభావం తగ్గుతుంది. మధ్యాహ్నం పెరుగు తీసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి వేడి నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. రాత్రి పెరుగు తింటే దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల పెరుగు జీర్ణం కావడం కష్టం అవుతుంది.

ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. దీనివల్ల గ్యాస్, ఆమ్లత వంటి సమస్యలు వస్తాయి. వ్యాయామం వల్ల అధికంగా చెమట పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే పెరుగు తింటే జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. ఉదయాన్నే ఓ కప్పు పెరుగు తింటే మెటబాలిజం పెరుగుతుంది. ఎనర్జీగా ఉంటారు. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణశక్తిని పెంచి గట్ హెల్త్‌ని కాపాడుతుంది. ఇందుకోసం హోల్ గ్రెయిన్స్, సెరల్స్‌తో కలిపి తీసుకోవచ్చు. అయితే, లాక్టోస్ అసహనం ఉన్న వారు నైట్ టైం పెరుగును అస్సలు తినకపోవడమే మంచిది. ఒక వేల ఇలాంటి వారు రాత్రిపూట పెరుగును తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. లాక్టోస్ అసహనం ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us