
Baba Ramdev: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి యోగా, ఆయుర్వేదం ప్రాముఖ్యతను తెలియజేసిన యోగ గురువు స్వామి రామ్‌దేవ్, 60 ఏళ్లకు చేరువవుతున్నా ఇప్పటికీ ఎంతో చురుగ్గా, దృఢంగా, ఉత్సాహంగా కనిపిస్తారు. ఆయన ఫిట్‌నెస్ చూసి యువత సైతం ఆశ్చర్యపోతుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయన తన ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్నారు. ముఖ్యంగా బాడీ బిల్డింగ్, మజిల్స్ కోసం ఆయన ఏ ప్రోటీన్ పౌడర్ వాడుతుంటారనే ప్రశ్నపై ఆసక్తికర సమాధానమిచ్చారు
ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక ‘ఎజెండా ఆజ్ తక్’ కార్యక్రమంలో స్వామి రామ్‌దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేటి తరం జీవనశైలి, శారీరక మానసిక ఆరోగ్యం, ఆహారపు అలవాట్లపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే యాంకర్ ఆయనను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. “బాబా గారు, మీ నిత్య యవ్వనానికి, దృఢత్వానికి కారణం ఏంటి? మీరు ఆరోగ్యంగా ఉండటానికి నిత్యం ఎలాంటి ఆహారం తీసుకుంటారు? మీరు కూడా మార్కెట్లో దొరికే ఏమైనా ప్రోటీన్ పౌడర్లు వాడుతుంటారా? అని అడిగిన ప్రశ్నకు ఆసక్తకరమైన సమాధానం ఇచ్చారు.
ఈ ప్రశ్నకు స్వామి రామ్‌దేవ్ తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు. “నేను నా జీవితంలో ఎలాంటి కృత్రిమ ప్రోటీన్ పౌడర్లను తీసుకోను” అని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్లో లభించే కెమికల్స్ లేదా కృత్రిమ సప్లిమెంట్ల కంటే ప్రకృతి సిద్ధంగా లభించే సహజ ఆహారమే శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన వివరించారు.
తన రోజువారీ దినచర్య గురించి రామ్‌దేవ్ మాట్లాడుతూ.. నేను ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేస్తాను. నా ఉదయం కోట్లాది మంది ప్రజలతో కలిసి యోగాసనాలతో ప్రారంభమవుతుంది. ఒకవేళ నేను ఉదయాన్నే నిద్ర లేవకపోతే, నన్ను నమ్మి టీవీల ముందు కూర్చునే కోట్లాది మంది ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది అని తన బాధ్యతను గుర్తుచేసుకున్నారు. నిరంతర శ్రమ, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, నిత్యం యోగా సాధన చేయడమే తన శారీరక, మానసిక ఉల్లాసానికి అసలైన కారణమని ఆయన పేర్కొన్నారు
ఇది కూడా చదవండి: మైలేజ్‌లో తిరుగుండదు.. భారతదేశంలో లభించే 5 అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!
ఇది కూడా చదవండి: Snakebites: పాము కాటు వేసిన వెంటనే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. ప్రాణాలకే ప్రమాదం..!
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి