వారానికి ఒకసారి టాయిలెట్ కమోడ్‌లో ఐస్ క్యూబ్స్‌ వేయండి.. ఆ తర్వాత జరిగే మ్యాజిక్ చూస్తే షాక్ అవుతారు!

ఇంటిని ఎంత అందంగా సర్దుకున్నా, బాత్‌రూమ్, టాయిలెట్ రూమ్‌లను శుభ్రంగా, దుర్వాసన లేకుండా ఉంచడం గృహిణులకు ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్ క్లీనర్లు, రూమ్ ఫ్రెషనర్లు వాడినప్పటికీ కొన్నిసార్లు టాయిలెట్ నుండి వచ్చే వింత వాసనలు తగ్గవు. అయితే, రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉండే ఐస్ క్యూబ్స్‌ (Ice Cubes) సహాయంతో టాయిలెట్‌ను సరికొత్తగా మెరిపించవచ్చని మీకు తెలుసా? ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ సింపుల్ ట్రిక్ వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.

వారానికి ఒకసారి టాయిలెట్ కమోడ్‌లో ఐస్ క్యూబ్స్‌ వేయండి.. ఆ తర్వాత జరిగే మ్యాజిక్ చూస్తే షాక్ అవుతారు!
Toilet Cleaning Hack

Updated on: May 20, 2026 | 8:46 PM

ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం హాల్, కిచెన్‌, బెడ్‌రూమ్‌ క్లీనింగ్‌పై ఎంత శ్రద్ధ పెడతామో, అంతకంటే ఎక్కువగా బాత్రూం, కమోడ్ శుభ్రతపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ఎందుకంటే బ్యాక్టీరియా అత్యంత వేగంగా పెరిగే ప్రదేశం బాత్రూమే. బాత్రూం, టాయిలెట్‌ను శుభ్రంగా ఉంచుకోవడం ఇంటి శుభ్రతలో చాలా ముఖ్యమైన భాగం. అయితే, ఎంత శుభ్రం చేసినా, కమోడ్‌పై తరచుగా మరకలు, దుర్వాసన లేదా పసుపు రంగు పొర కనిపిస్తాయి. బాత్రూంలోని కమోడ్‌పై నలుపు, పసుపు మరకలు తరచుగా కనిపిస్తాయి. అటువంటి మరకలు ఒక్కసారి కడగడంతో పోవు. కమోడ్‌పై ఉన్న పసుపు, జిగట మరకలను తొలగించడానికి, మనం దానిని పదేపదే కడగాలి. రుద్ధి రుద్ధి శుభ్రం చేయాలి. అటువంటి పరిస్థితిలో ఎక్కువ శ్రమ లేకుండా, తక్కువ సమయంలో కమోడ్‌ను శుభ్రం చేయడానికి ఏదైనా సులభమైన పరిష్కారం ఉంటే బావుంటుందని దాదాపుగా అందరూ భావిస్తారు. కమోడ్‌ను శుభ్రంగా ఉంచుకోవడానికి ఉన్న ఇంటి చిట్కాలలో, కమోడ్‌లో ఐస్ క్యూబ్స్ వేయడం ఒక అద్భుతమైన ట్రిక్.

ఇది వింతగా అనిపించినప్పటికీ, ఈ చిట్కాను వారానికి ఒకసారి పాటించడం వల్ల కమోడ్ త్వరగా శుభ్రపడుతుంది. టాయిలెట్ కమోడ్‌లో వారానికి ఒకసారి ఐస్ ముక్కలు (Ice Cubes) వేయడం అనేది వినడానికి వింతగా అనిపించినప్పటికీ, ఇది బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచే ఒక అద్భుతమైన, సులభమైన హోమ్ హ్యాక్ (Home Hack). టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి ఐస్ క్యూబ్ హ్యాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఖరీదైన టాయిలెట్ క్లీనర్ల కోసం నీళ్లలా డబ్బు ఖర్చు పెట్టే బదులు, ఫ్రీజర్‌లోని ఐస్ క్యూబ్స్ కమోడ్‌ను శుభ్రపరచడానికి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.

దుర్వాసనకు చెక్ పెట్టే ఐస్ ముక్కలు: కమోడ్‌లో ఐస్ ముక్కలు వేయడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం దుర్వాసనను అరికట్టడం. టాయిలెట్ పైపులలో స్థిరపడే మురికి కారణంగా బ్యాక్టీరియా చేరి దుర్వాసన వస్తుంది. కమోడ్‌లో ఒక పెద్ద గిన్నెడు ఐస్ ముక్కలను వేసి, దానిపై కొద్దిగా బేకింగ్ సోడా లేదా నిమ్మరసం చల్లి కాసేపు వదిలేయాలి. ఐస్ కరుగుతున్న కొద్దీ ఆ చల్లదనం వల్ల వాసన కలిగించే బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఆగిపోతుంది.

ఇవి కూడా చదవండి

పైపుల క్లీనింగ్ సులభం అవుతుంది: టాయిలెట్ కమోడ్‌లో ఐస్ ముక్కలను వేసి ఒకేసారి ఫోర్స్‌గా ఫ్లష్ (Flush) చేయడం వల్ల, ఆ ఐస్ ముక్కల ఘన పరిమాణం పైపుల లోపల గోడలకు అంటుకున్న నల్లటి మురికిని, నాచును స్క్రాప్ (రుద్దినట్లు) చేస్తూ బయటకు నెట్టేస్తుంది. దీనివల్ల పైపులలో ఎలాంటి బ్లాకేజ్ (అడ్డంకులు) ఏర్పడకుండా డ్రైనేజీ వ్యవస్థ సాఫీగా సాగుతుంది.

ఎలా ఉపయోగించాలి?: వారానికి ఒకసారి ఒక బకెట్ లేదా పెద్ద గిన్నె నిండా ఐస్ ముక్కలను తీసుకోండి. వాటిని నేరుగా టాయిలెట్ కమోడ్‌లో వేయండి. దానిపై మీ ఇంట్లో ఉండే కొద్దిగా బట్టల డిటర్జెంట్ పౌడర్ లేదా టాయిలెట్ క్లీనర్ లిక్విడ్‌ను చల్లండి. ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై బ్రష్‌తో మెల్లగా రుద్ది ఫ్లష్ చేసేయండి. ఇలా చేయడం వల్ల కమోడ్ లోపలి భాగం తెల్లగా మెరవడమే కాకుండా, బాత్రూమ్ అంతా మంచి సువాసనతో తాజాగా మారుతుంది. రసాయన ఘాటు వాసనలు పడని వారికి, తక్కువ ఖర్చుతో ఇళ్లను శుభ్రం చేసుకోవాలనుకునే వారికి ఈ ఐస్ క్యూబ్స్ హ్యాక్ ఒక అద్భుతమైన వరం లాంటిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us