Why Air Cooler Blast: ఓరీ దేవుడో.. ఎయిర్ కూలర్లు బాంబులా పేలుతున్నాయి? మనం చేసే ఈ తప్పులే దానికి కారణం!

Updated on: May 23, 2026 | 5:33 PM

సాధారణంగా ఎయిర్ కండిషనర్ల (AC) లో కంప్రెసర్ లేదా హై-ప్రెజర్ గ్యాస్ ఉంటుంది. కాబట్టి, అవి పేలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఎయిర్ కూలర్లలో అలాంటి గ్యాస్ లేదా కంప్రెసర్ ఉండవు. అయినప్పటికీ, కూలర్ మోటార్ తీవ్రంగా వేడెక్కిపోవడం (Overheating) లేదా షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల అవి పేలిపోవడం లేదా మంటలు అంటుకోవడం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. కూలర్ వాడేటప్పుడు ప్రజలు చేసే ఆ 5 ప్రధాన తప్పులు ఇవే:

1 / 7
మండే ఎండలు, రోహిణీ కార్తె రోజుల్లో ఏసీలే కాకుండా కూలర్లు కూడా పేలిపోవచ్చు. ఎందుకంటే,.. ఈ రోజుల్లో దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రత పెరిగింది. దీని కారణంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మీ ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల మీరు చేసే ఒక చిన్న నిర్లక్ష్యం తీవ్రమైన ప్రమాదానికి కారణం కావచ్చు. కొన్నిసార్లు అధిక వేడి, షార్ట్ సర్క్యూ, తప్పు వైరింగ్ కారణంగా, ఎయిర్ కూలర్లలో కూడా అగ్నిప్రమాదాలు, పేలుళ్లు జరిగే అవకాశలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో కూలర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

2 / 7
నీరు లేకుండా కూలర్ నడపడం (Running Without Water): చాలా మంది కూలర్‌లో నీరు అయిపోయినా సరే గమనించకుండా కేవలం ఫ్యాన్ మోడ్‌లో లేదా పంప్ ఆన్‌లో ఉంచి గంటల తరబడి నడుపుతుంటారు. నీరు లేనప్పుడు కూలర్ లోపల తేమ తగ్గిపోయి, మోటార్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మోటార్ విపరీతంగా వేడెక్కి (Overheat) కాలిపోవడమే కాకుండా ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం ఉంది.

3 / 7
నిరంతరాయంగా గంటల తరబడి వాడటం (Continuous Usage): తీవ్రమైన ఎండల కారణంగా చాలా ఇళ్లలో కూలర్లను రాత్రి పగలు తేడా లేకుండా వరుసగా 10 నుండి 12 గంటల పాటు నాన్‌స్టాప్‌గా నడుపుతుంటారు. కూలర్ మోటార్‌కు తగినంత విశ్రాంతి దొరకనప్పుడు, అది వేడెక్కి లోపల ఉండే వైరింగ్ కరిగిపోతుంది. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదాలు సంభవిస్తాయి.

4 / 7
గాలి ఆడని గదిలో (Ventilation లేని చోట) ఉంచడం: కూలర్‌ను ఎల్లప్పుడూ కిటికీ దగ్గర లేదా బయటి తాజా గాలి లోపలికి వచ్చే ప్రదేశంలో ఉంచాలి. అలా కాకుండా పూర్తిగా మూసివేసిన చిన్న గదిలో కూలర్ పెడితే, గదిలో హ్యూమిడిటీ (తేమ శాతం) విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల కూలర్ బాడీ, వైరింగ్‌పై నీటి బిందువులు చేరి షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తుంది.

5 / 7
పాత వైరింగ్, లోకల్ ఎక్స్‌టెన్షన్ బోర్డులు వాడటం: కూలర్లు ఎక్కువ విద్యుత్‌ను (Power) వినియోగిస్తాయి. వాటిని సన్నని వైర్లు ఉన్న లోకల్ ఎక్స్‌టెన్షన్ బోర్డులకు కనెక్ట్ చేసినప్పుడు, ఆ వైర్లు లోడ్‌ను తట్టుకోలేక కరిగిపోతాయి. అలాగే కూలర్ లోపల వైరింగ్ పాతదైనా లేదా ఎలుకలు కొరికేసినా కూడా విద్యుత్ లీకేజీ జరిగి ప్రమాదాలు జరుగుతాయి. కూలర్‌లో నీరు, విద్యుత్ రెండూ కలిసి ఉంటాయి కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తే కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంది.

6 / 7
సర్వీసింగ్ చేయకపోవడం, పాత కూలింగ్ ప్యాడ్స్: ప్రతి సీజన్ ప్రారంభంలో కూలర్‌ను క్లీన్ చేయాలి. మోటార్‌కు ఆయిలింగ్ చేయకపోవడం వల్ల అది జామ్ అయిపోతుంది. జామ్ అయిన మోటార్‌ను అలాగే ఆన్ చేస్తే అది తిరగడానికి ఎక్కువ విద్యుత్‌ను లాక్కుంటుంది, తద్వారా నిమిషాల్లోనే కాలిపోతుంది. అలాగే పాత గడ్డి (Cooling pads) మార్చకపోవడం వల్ల కూడా గాలి సరిగ్గా ఆడక మోటార్‌పై లోడ్ పడుతుంది.

7 / 7
సురక్షితంగా ఉండటానికి చిట్కాలు: కూలర్ మోటార్‌కు ప్రతి 5-6 గంటల వాడకం తర్వాత కనీసం అరగంట పాటు విశ్రాంతి ఇవ్వండి. కూలర్‌లో నీరు ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. ఎల్లప్పుడూ ఇంట్లో మంచి ఎర్తింగ్ (Earthing) ఉండేలా చూసుకోవాలి. ఐఎస్‌ఐ (ISI) మార్క్ ఉన్న వైరింగ్, ప్లగ్‌లనే వాడాలి.

Follow Us