Ear Pain
చెవినొప్పి అనేది వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ హఠాత్తుగా వచ్చే సాధారణ సమస్య. చెవి నొప్పిని భరించటం నరకంకంటే తక్కువేమీ కాదు. అయితే, తరచూ వచ్చే చెవి నొప్పిని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇయర్ బడ్స్ వాడకం హానికరమని అధ్యయనాలు చెబుతున్నాయి. చెవినొప్పిని తగ్గించుకోవటానికి కొన్ని ఇంటి నివారణలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
చెవి నొప్పికి సింపుల్ హోం రెమెడీస్
- అల్లం రసం: అల్లం రసాన్ని ఆలివ్ నూనెతో కలిపి చెవిలో వేసుకుంటే నొప్పి తగ్గుతుంది. అందుకోసం ముందుగా ఆలివ్ ఆయిల్ ను తరచుగా వేడి చేసి నూనె చల్లారిన తర్వాత చెవిలో పెట్టుకుంటే నొప్పి వెంటనే మాయమవుతుంది.
- తులసి ఆకు: తులసి ఆకు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. చెవుల్లో తులసి రసాన్ని పిండటం వల్ల కూడా నొప్పి అదుపులోకి వస్తుంది.
- మామిడి ఆకుల రసం: మామిడి ఆకుల రసం చెవి సంబంధిత వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
- మస్టర్డ్ ఆయిల్: మస్టర్డ్ ఆయిల్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి.ఆవాల నూనెను చెవికి వెచ్చగా చేసి చెవికి తరచుగా రాసుకుంటే చెవినొప్పి నుండి విముక్తి లభిస్తుంది.