వ్యాక్సింగ్, రేజర్ వద్దే వద్దు.. అవాంఛిత రోమాలను తొలగించే సులభమైన హోమ్ రెమెడీ!

శరీరంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించుకోవడం ప్రతీ ఒక్కరికీ నిత్యం ఎదురయ్యే అతిపెద్ద సమస్య. ఇందుకోసం చాలామంది పార్లర్‌కు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసి వ్యాక్సింగ్ చేయించుకోవడం లేదా అత్యవసర సమయంలో రేజర్‌తో షేవింగ్ చేసుకోవడం చేస్తుంటారు. కానీ ఈ పద్ధతుల వల్ల చర్మంపై నల్లటి ట్యానింగ్ రావడం, కుదుళ్ల వద్ద చిన్న చిన్న పింపుల్స్, మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ఇబ్బందులు లేకుండా ఇంట్లోనే లభించే వస్తువులతో ఎలాంటి నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చని తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. అది ఎలాగంటే..

వ్యాక్సింగ్, రేజర్ వద్దే వద్దు.. అవాంఛిత రోమాలను తొలగించే సులభమైన హోమ్ రెమెడీ!
Unwanted Hair Removal At Home

Updated on: Sep 24, 2026 | 8:46 AM

శరీరంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించడానికి పదే పదే పార్లర్‌కు వెళ్లడం, వ్యాక్సింగ్ లేదా రేజర్ వాడటం వల్ల చర్మంపై నల్లటి మచ్చలు, దద్దుర్లు, ట వస్తుంటాయి. ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు. ఇంట్లో అందుబాటులో ఉండే సహజ పదార్థాలతో తయారు చేసిన మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్నచోట రాసి 5-10 నిమిషాల తర్వాత వెంట్రుకలు పెరిగే దిశకు వ్యతిరేకంగా తుడిచేస్తే రోమాలు సులువుగా ఊడిపోయి చర్మం మృదువుగా మారుతుంది. దీని తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు

తురిమిన స్నానపు సబ్బు – 1 చెంచా

పంచదార – 1/2 చెంచా

ఇవి కూడా చదవండి

నీళ్లు – 2 నుండి 3 చెంచాలు

గోధుమపిండి – 1 చెంచా

నిమ్మరసం – 4 నుండి 5 చుక్కలు

టూత్‌పేస్ట్ – బఠానీ గింజంత

బేకింగ్ సోడా – 2 నుండి 3 చిటికెడు

పేస్ట్ తయారుచేసే విధానం:

ముందుగా ఒక గిన్నెలో తురిమిన సబ్బు, పంచదార, నీటిని వేసి బాగా కలపాలి. దానికి ఒక చెంచా గోధుమపిండిని చేర్చి చిక్కగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై ఉంచి 1 నుండి 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. దీనివల్ల సబ్బు పూర్తిగా కరిగి పేస్ట్ చాలా స్మూత్‌గా మారుతుంది. అనంతరం పాత్రను దించి, పేస్ట్ కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టాలి. పేస్ట్ చల్లారిన తర్వాత అందులో నిమ్మరసం, బఠానీ గింజంత టూత్‌పేస్ట్, బేకింగ్ సోడా వేసి క్రీమీగా అయ్యేంతవరకు బాగా మిక్స్ చేయాలి.

ఉపయోగించే పద్ధతి:

మొదట అవాంఛిత రోమాలు ఉన్న ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేసుకుని ఆరబెట్టాలి. తయారుచేసుకున్న పేస్ట్‌ను రోమాలు ఉన్న భాగంలో ఒక లేయర్‌లా రాయాలి. దీనిని 5 నుండి 10 నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి ఒకవేళ వెంట్రుకలు దట్టంగా ఉంటే మరికొంత సమయం ఉంచవచ్చు. ఆ తర్వాత ఒక తడి టిష్యూ లేదా కాటన్ గుడ్డ సహాయంతో వెంట్రుకలు పెరిగే దిశకు వ్యతిరేక దిశలో మెల్లగా తుడిచివేయాలి. ఈ సహజసిద్ధమైన చిట్కా ద్వారా అవాంఛిత రోమాలు సులువుగా ఊడిపోతాయి, చర్మం మృదువుగా మారుతుంది. క్రమంగా ఈ పద్ధతిని పాటిస్తుంటే వెంట్రుకల పెరుగుదల కూడా తగ్గుతుంది.

గమనిక: ప్రతీ ఒక్కరి చర్మ తత్వం ఒకేలా ఉండదు. నిమ్మరసం లేదా బేకింగ్ సోడా కొందరి చర్మానికి సరిపడక మంట లేదా అలర్జీ రావచ్చు. అందుకే పూర్తిస్థాయిలో ఉపయోగించే ముందు చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us