తెలుగురాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్.. ఒకే టార్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. IRCTC అదిరిపోయే ఆఫర్

IRCTC 7 Jyotirlinga Tour: మన దేశంలో ఉన్న జోతిర్లింగాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి వారి కోసం ఇండియన్ రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఒకేసారి ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునేలా సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజ్‌ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

తెలుగురాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్.. ఒకే టార్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. IRCTC అదిరిపోయే ఆఫర్
Irctc Jyotirlinga Tour

Updated on: May 20, 2026 | 8:23 AM

ప్రయానికులకు రైల్వే శాఖ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు IRCTC సరికొత్త టూర్ ప్యాకేజ్‌ను తీసుకొచ్చింది. ఈ ప్యాకేజ్‌లో మొత్తం 7 జ్యోతిర్లింగాలను మీరు దర్శించుకోవచ్చు. మొత్తం 11 డేస్, 10 నైట్స్‌ సాగే ఈ యాత్రలో మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్‌ జ్యోతిర్లింగం మొదలుకొని ఓంకారేశ్వర్‌, గుజరాత్‌లోని ద్వారక, సోమనాథ్‌, మహారాష్ట్రలోని పుణె, నాసిక్‌, ఛత్రపతి శంభాజీనగర్‌లోని మొత్తం 7 జ్యోతిర్లింగాలను ఒకే యాత్రలో మీరు దర్శించుకోవచ్చు. ఈ ప్యాకేజీలో ఒక్కో ప్రయాణికుడికి టికెట్ ధర రూ.17,600గా IRTCT నిర్ణయించింది. జూన్ 16 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుండగా.. ఈ యాత్రకు వెళ్లాలనుకే తెలుగు రాష్ట్రాల ప్రజలకు సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్‌ జంక్షన్‌లలో ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజ్ తీసుకున్న ప్రయాణికులు ఈ ప్రాంతాల్లో ట్రైన్ ఎక్కవచ్చు.

ఈ ప్యాకేజ్‌లో డేట్‌ వైజ్‌గా ప్రయాణం వివరాలు ఇలా

  • డే1: జూన్ 16, ఉదయం 10:00 గంటలకు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు బయలుదేరి, కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా మధ్యప్రదేశ్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఉజ్జయిని బయల్దేరుతుంది.
  • డే2: ఇక రెండో రోజు ఉదయం 10 గంటలకు ఈ ట్రైన్ ఉజ్జయిని రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడే ప్రయాణికులకు హోటల్‌ బస కూడా ఉంటుంది. ఇక మహాకాళేశ్వర ఆలయ సందర్శిన తర్వాత మళ్లీ రాత్రి అక్కడే స్టే చేయాల్సి ఉంటుంది.
  • డే3: ఇక మూడో రోజు మార్నింగ్ ఫ్రెష్‌ అయి బ్రేక్‌ ఫాస్ట్ చేసిన తర్వాత రోడ్డు మార్గన ఓంకారేశ్వర్‌ ఆలయాన్ని చేరుకుంటారు. అక్కడ దర్శనం పూర్తైన తర్వాత మళ్లీ ట్రైన్‌లో గుజరాత్‌లోని ద్వారకకు వెళ్తారు.
  • డే4: ఇక నాలుగో రోజు సాయంత్రానికి మీరు ద్వారక రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడే నైట్ స్టే, భోజనం ఉంటుంది.
  • డే5: ఇక ఐదో రోజు మార్నింగ్ స్నానం చేసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ద్వారకదీశ్‌ ఆలయం దర్శనం ఉంటుంది. దర్శనం పూర్తయ్యాక అక్కడే లంచ్‌ కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం బెట్‌ ద్వారక, నాగేశ్వర్‌ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి సోమనాథ్‌కు బయల్దేరాల్సి ఉంటుంది.
  • డే6: ఇక ఆరో రోజు మార్నింగ్ వరకు మీరు సోమనాథ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడే హోటల్‌లో స్నానాలు చేసి సోమనాథ్ ఆలయానికి వెళ్తారు. అక్కడ దర్శనం పూర్తైన తర్వాత సోమనాథ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి పుణెలోని ఖడ్కికి బయల్దేరుతారు.
  • డే7: ఇక ఏడో రోజు మధ్యాహ్నానానికి మీరు ఖడ్కి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. ఇక ఆరోజు అక్కడే హోటల్‌లో స్టే చేయాల్సి ఉంటుంది.
  • డే8: ఇక ఎనిమిదో రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత భీమశంకర ఆలయాన్ని దర్శించుకొని. అక్కడి నుంచి నాసిక్‌ బయల్దేరుతారు( అయితే ప్రస్తుతం భీమశంకల ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆలయం క్లోజ్ ఉంటే.. పూణేలోని ఇతర ఆలయాల సందర్శన ఉంటుంది.
  • డే9: ఇక తొమ్మిదోరోజు మార్నింగ్ నాసిక్‌ రోడ్‌ రైల్వేస్టేషన్‌కి చేరుకుంటారు. అక్కడ దిగి ఫ్రెష్‌ అయ్యాక త్రయంబకేశ్వర్‌ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకొంటారు. తర్వాత అక్కడి నుంచి ఛత్రపతి శంభాజీనగర్‌కు బయల్దేరుతారు.
  • డే 10: ఇక పదో రోజు మార్నింగ్ వరకు మీరు ఛత్రపతి శంభాజీనగర్‌కు రీచ్ అవుతారు. అక్కడే హోటల్‌ ఫ్రెష్‌ అయి ఘృశ్నేశ్వర్‌ జ్యోతిర్లింగ ఆలయానికి వెళ్తారు. ఇక్కడ దర్శనం తర్వాత మీ యాత్ర పూర్తవుతుంది. దీంతో మీరు తిరిగి ఛత్రపతి శంభాజీనగర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి సికింద్రాబాద్‌ బయల్దేరుతారు.
  • డే11: ఇక 11వ రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకొని అక్కడి నుంచి ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్లిపోతారు. ఇంతటితో యాత్ర ముగుస్తుంది.

ఏజ్‌ను బట్టి టూర్‌ ప్యాకేజీ

సాదారణంగా పెద్దలకు అయితే ఒక్కో టికెట్‌ ధర రూ.17,600 ఉంటుంది. అదే 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకైతే రూ.16,300 వరకు ఉంటుంది. అయితే ప్యాకేజ్‌ను బట్టి ట్రైన్‌ కోచ్‌లు మారుతూ ఉంటాయి. వెల్లిన ప్రదేశాల్లో గదుల్లో కూడా మార్పు ఉంటుంది. ఎక్కువ ప్యాకేజ్ ఉన్నవారికి ఏసీ గదుల్లో బస ఉంటుంది. సాదారణ ప్యాకేజ్ వారికి నాన్‌ఏసీ గదుల్లో బస ఉంటుంది. ఈ ప్యాకేజ్ మొత్తం భోజనం , వసది సదుపాయం కల్పిస్తారు. అలాగే ఇన్స్యూరెస్ కూడా ఉంటుంది. సహాయం కోసం IRCTC సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. అయితే ఆలయాల్లో ప్రత్యేక దర్శనం కావాల్సి ఉంటే మీరే డబ్బులు పెట్టుకోవాలి. ప్యాకేజ్ బుక్‌ చేసుకోవాలన్నా, మరిన్ని వివరాలు కావాలన్నా.. IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us