
ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అద్భుతమైన పండ్లలో లసోరా (Lasora) ఒకటి. దీనిని తెలుగులో నక్కేర లేదా విరిగి పండు అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం కార్డియా మైక్సా (Cordia myxa). పైన చూడటానికి చిన్నవిగా, లోపల జిగురుగా ఉండే ఈ పండ్లు సాధారణంగా వేసవి కాలంలో లభిస్తాయి. ఈ చిన్న పండులో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నక్కేర పండులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలోని ఔషధ గుణాలు బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడతాయి.
శ్వాసకోస వ్యాధుల నివారణ: ఉబ్బసం (Asthma), దీర్ఘకాలిక దగ్గు మరియు జలుబుతో బాధపడేవారికి ఈ పండు మేలు చేస్తుంది. ఇది ఊపిరితిత్తులలోని శ్లేష్మాన్ని తొలగించి, శ్వాస తీసుకోవడం సులభతరం చేస్తుంది.
కీళ్ల నొప్పులు, వాపులు: వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పులు (Joint Pains) తగ్గించడానికి నక్కేర పండును ఆయుర్వేదంలో వాడతారు. ఇది ఎముకల బలాన్ని పెంచడంలో కూడా తోడ్పడుతుంది.
కాలేయ రక్షణ: ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయం (Liver) పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
జీర్ణక్రియ మెరుగుదల: దీనిలోని జిగురు పదార్థం మరియు ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తాయి. కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలకు ఇది మంచి పరిష్కారం.
చర్మ వ్యాధులు: చర్మంపై వచ్చే అలర్జీలు, దురదలను తగ్గించడానికి ఈ పండు లోపలి గుజ్జును ఉపయోగిస్తారు.
నక్కేర పండును పచ్చడి రూపంలో లేదా ఎండబెట్టి వడియాలుగా కూడా చేసుకుంటారు. సీజనల్‌గా దొరికే ఇలాంటి దేశీ పండ్లను తినడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి, మీకు ఎక్కడైనా ఈ నక్కేర చెట్టు కనిపిస్తే, ఆ పండ్లను సేకరించి మీ ఆహారంలో భాగం చేసుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..