Health: రాత్రుళ్లు చెమటలు పడుతున్నాయా.? ఈ సమస్యలు కావొచ్చు..

రాత్రిపూట చెమటలు పట్టడం సర్వసాధారణ విషయం. అయితే వాతావరణ వేడిగా ఉన్న సమయంలో చెమటలు రావడం కామన్‌ కానీ.. వాతావరణం చల్లగా ఉన్నా, ఫ్యాన్‌ ఆన్‌లో ఉన్నా చెమటలు వస్తుంటే మాత్రం జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు ఉన్నపలంగా చెమటలు పట్టడం దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

Health: రాత్రుళ్లు చెమటలు పడుతున్నాయా.? ఈ సమస్యలు కావొచ్చు..
Health
Follow us

|

Updated on: Jun 27, 2024 | 9:16 PM

రాత్రిపూట చెమటలు పట్టడం సర్వసాధారణ విషయం. అయితే వాతావరణ వేడిగా ఉన్న సమయంలో చెమటలు రావడం కామన్‌ కానీ.. వాతావరణం చల్లగా ఉన్నా, ఫ్యాన్‌ ఆన్‌లో ఉన్నా చెమటలు వస్తుంటే మాత్రం జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు ఉన్నపలంగా చెమటలు పట్టడం దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

* అసిడటీ వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా చెమటలు పట్టే అవకాశం ఉంటుంది. జీర్ణాశయంలోని ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకొని రావటం వల్ల కూడా చెమటలు పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఛాతీలో మంటతో చెమటలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* కొన్ని రకాల ఇన్‌ఫెక్షతో ఇబ్బంది పడుతున్నా.. రాత్రి చెమటలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్షయ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న వారిలో ఈ సమస్య కనిపించే అవకాశం ఉంటుంది.

* హైపర్‌థైరాయిడిజమ్‌ సమస్యతో బాధపడేవారు కూడా రాత్రుళ్లు చెమట బారిన పడే అవకాశం ఉంటుంది. రాత్రిపూట చెమటతో పాటు గుండె ద పెరగడం, అలసట వంటివి కూడా చెమటలు అధికంగా రావడానికి కారణాలు చెప్పొచ్చు.

* రక్తంలో గ్లూకోజ్‌ లెవ్స్‌ పడిపోయినా చెమటలు పట్టొచ్చు. దీర్ఘకాలంగా ఈ సమస్యతో ఇబ్బందిపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

* కొన్ని రకాల క్యాన్సర్ల తొలిదశలో రాత్రిపూట చెమటలు పడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. హాడ్కిన్స్‌, నాన్‌-హాడ్కిన్స్‌ లింఫోమా వంటి క్యాన్సర్లలో చెమటలు పట్టడం ప్రాథమిక సమస్యగా చెప్పొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..
ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..
అబ్బ.. చలచల్లని వార్త.. వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
అబ్బ.. చలచల్లని వార్త.. వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
కల్కి సినిమాపై బన్నీ రియాక్షన్.. ప్రభాస్ గురించి ఏమన్నారంటే..
కల్కి సినిమాపై బన్నీ రియాక్షన్.. ప్రభాస్ గురించి ఏమన్నారంటే..
Team India: ఛాంపియన్ జట్టుపై ప్రశంసలు..
Team India: ఛాంపియన్ జట్టుపై ప్రశంసలు..