Lifestyle: ఆల్కహాల్‌ ఒక్కటే కాదు.. ఇవి కూడా లివర్‌ను పాడు చేస్తాయి

శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో లివర్‌ ప్రధానమైంది. శరీరంలో ఎన్నో కీలక జీవక్రియలకు కాలేయం ఉపయోగపడుతుంది. అందుకే కాలేయం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. అయితే మనం తీసుకుంటున్న ఆహారం, జీవన విధానంలో చేసే తప్పుల కారణంగా లివర్ ఆరోగ్యం దెబ్బతింటుంది. సాధారణంగా లివర్‌ పాడైంది అంటే...

Lifestyle: ఆల్కహాల్‌ ఒక్కటే కాదు.. ఇవి కూడా లివర్‌ను పాడు చేస్తాయి
లివర్ కాపాడటంలో ద్రాక్ష పండ్లు కూడా చక్కగా పని చేస్తాయి. వీటిని మీ డైట్‌లో చేర్చుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని తింటే ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుంది. అలాగే కణాలు దెబ్బతినకుండా చేస్తుంది.
Follow us

|

Updated on: Apr 19, 2024 | 2:50 PM

శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో లివర్‌ ప్రధానమైంది. శరీరంలో ఎన్నో కీలక జీవక్రియలకు కాలేయం ఉపయోగపడుతుంది. అందుకే కాలేయం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. అయితే మనం తీసుకుంటున్న ఆహారం, జీవన విధానంలో చేసే తప్పుల కారణంగా లివర్ ఆరోగ్యం దెబ్బతింటుంది. సాధారణంగా లివర్‌ పాడైంది అంటే ప్రధాన కారణం ఆల్కహాల్‌ అని అనుకుంటాం. అయితే కేవలం ఆల్కహాల్ మాత్రమే కాకుండా మరికొన్ని అలవాట్లు సైతం లివర్‌ను పాడు చేస్తాయని మీకు తెలుసా.? లివర్‌ ఆరోగ్యాన్ని పాడు చేసే ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* లివర్‌ ఆరోగ్యంపై మాంసం ఉత్పత్తులు ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్‌ వంటి సమస్యలు రావడానికి ఇదే కారణంగా చెప్పొచ్చు. అందుకే మాంసం ఉత్పత్తులను తక్కువగా తీసుకోవాలి అని సూచిస్తున్నారు.

* ఇక మైదాతో చేసిన ఆహారాలు కూడా కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నూనెలో వేయించిన మైదా పిండితో చేసిన ఆహారాలు లివర్‌పై చెడు ప్రభావం చూపుతాయి. పాస్తా, పిజ్జా, బ్రెడ్ వంటి ఆహారాలు కాలేయాన్ని దెబ్బతీస్తాయి.

* ఉప్పు ఎక్కువగా తీసుకున్నా కాలేయం ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.

* కూల్‌ డ్రింక్స్‌ వల్ల కూడా లివర్‌ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే అధిక చక్కెర లివర్‌ను దెబ్బ తీస్తుంది. ఫ్యాటీ లివర్‌కు కారణమవుతుంది.

* చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా లివర్‌ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర ఎక్కువగా తీసుకుంటే లివర్‌ అదనపు చక్కెరను కొవ్వుగా మారుస్తుంది. దీంతో ఫ్యాటీ లివర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది.

* రెడ్‌ మీట్ ఎక్కువగా తినే వారిలోనూ లివర్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రెడ్ మీట్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో కాలేయం దానిని జీర్ణం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది దీంతో కాలేయ పనితీరుపై ప్రభావం పడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..