
చంకల భాగంలో తేలికగా తట్టడం లేదా మెల్లగా నొక్కడం అనేది ప్రాచీన సాంప్రదాయ వైద్యంలోనూ, ఆధునిక ఆక్యుప్రెషర్ విధానాల్లోనూ ఒక సులువైన ఆరోగ్య చిట్కాగా ప్రాచుర్యం పొందుతోంది. చంకల భాగంలో అత్యధిక సంఖ్యలో లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఇది రక్తప్రసరణను మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకుందాం..
మన శరీరంలో వ్యాధినిరోధక వ్యవస్థకు లింఫాటిక్ వ్యవస్థ కీలక ఆధారం. చంకల భాగంలో వందలాది లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను, ట్యాక్సిన్లను ఫిల్టర్ చేయడానికి సహాయపడతాయి. వయస్సు పెరిగే కొద్దీ లేదా కదలికలు తగ్గడం వల్ల లసిక ప్రవాహం మందగిస్తుంది. రోజూ చంకల కింద మెల్లగా తట్టడం వల్ల ఈ లింఫ్ నోడ్స్ ప్రేరేపితమై శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు వేగంగా బయటకు వెళ్తాయి.
లింఫాటిక్ ప్రవాహం మెరుగవ్వడం వల్ల తెల్ల రక్తకణాలు శరీరమంతటా సజావుగా సరఫరా అవుతాయి. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
చంకలు, భుజాల చుట్టూ నాడీ వ్యవస్థకు చెందిన ముఖ్యమైన పాయింట్లు ఉంటాయి. రోజంతా పడిన శారీరక, మానసిక అలసట వల్ల భుజాలు, ఛాతీ భాగాల్లో బిగుతు ఏర్పడుతుంది. ఇక్కడ తేలికగా తట్టడం లేదా మసాజ్ చేయడం వల్ల నాడీ వ్యవస్థ శాంతించి, కండరాల ఒత్తిడి తక్షణమే దూరమవుతుంది.
చంకల భాగం ఎండోక్రైన్ వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ప్రేరేపించడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి సమతుల్యంగా ఉండటంతో పాటు, పైభాగంలో రక్తప్రసరణ పెరిగి చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
కూర్చుని లేదా నిలబడి ఒక చేతిని పైకి లేపి, మరో చేతి వేళ్లతో లేదా అరచేతితో చంక భాగంలో చాలా తేలికగా 1 నుండి 2 నిమిషాల పాటు తట్టాలి. ఇలా రెండు వైపులా రోజూ ఉదయం లేదా సాయంత్రం చేసుకోవచ్చు.
(గమనిక: తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, వాపులు లేదా సర్జరీలు అయినవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఇది ప్రయత్నించాలి.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..