
రోజంతా చురుగ్గా, శక్తివంతంగా ఉండటానికి, చిరుతిళ్లపై మోజును ఆరోగ్యకరమైన రీతిలో అదుపు చేయడానికి పోషకాలతో కూడిన హెల్తీ స్నాక్స్ ఎంతగానో తోడ్పడతాయి. అనారోగ్యకరమైన జంక్ ఫుడ్‌కు బదులుగా బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి నట్స్, గుమ్మడి, సన్‌ఫ్లవర్ గింజల మిశ్రమాన్ని ఎంచుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రొటీన్లు అందుతాయి. అలాగే, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, యాంటీఆక్సిడెంట్లు నిండిన బెర్రీలు, తృణధాన్యాలతో చేసిన పాప్‌కార్న్, మొలకెత్తిన గింజలు శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తూ, ఆకలిని నియంత్రిస్తాయి. వీటి పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
నట్స్, సీడ్స్ మిశ్రమం: బాదం, వాల్‌నట్స్, పిస్తాలతో పాటు గుమ్మడి గింజలు, అవిసె గింజలు, సన్‌ఫ్లవర్ గింజలను కలిపి ఒక బాక్స్‌లో ఉంచుకోండి. వీటిలో ఉండే హెల్తీ ఫ్యాట్స్, ప్రొటీన్లు, ఫైబర్ శరీరానికి రోజంతా అవసరమైన స్థిరమైన శక్తిని అందిస్తాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.
మొలకెత్తిన గింజల చాట్: పెసలు, శనగలు వంటి వాటిని మొలకలు ఎత్తించి, అందులో కొద్దిగా ఉల్లిపాయలు, టమోటాలు, నిమ్మరసం, చాట్ మసాలా కలుపుకుని తింటే అద్భుతమైన రుచితో పాటు బోలెడంత ప్రొటీన్ లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తూ, కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది.
తాజా పండ్లు, బెర్రీలు: యాపిల్, అరటిపండు లేదా బేరి పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచి, అలసటను దూరం చేస్తాయి.
పీనట్ బటర్, ఆపిల్ స్లైసెస్: యాపిల్ ముక్కలపై కొద్దిగా ఆర్గానిక్ పీనట్ బటర్ రాసుకుని తినడం ఒక సూపర్ కాంబినేషన్. యాపిల్‌లోని కార్బోహైడ్రేట్లు, పీనట్ బటర్‌లోని ప్రొటీన్లు కలిసి శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి.
రోస్టెడ్ మఖానా: ఫాక్స్ నట్స్ లేదా మఖానాను కొద్దిగా నెయ్యి, ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించుకుని స్నాక్స్‌గా తీసుకోవచ్చు. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా, కాల్షియం మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
హోల్ గ్రెయిన్ పాప్‌కార్న్: ఎక్కువ నూనె, చీజ్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకునే సాదా పాప్‌కార్న్ ఒక మంచి తృణధాన్యం. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలిని త్వరగా అణచివేస్తుంది.
సాయంత్రం పూట ఆకలి వేసినప్పుడు ఈ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను అలవాటు చేసుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవడమే కాకుండా, రోజంతా ఎనర్జిటిక్‌గా పని చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..