
నేటి ఆధునిక జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఎంత ప్యూర్ డైట్ పాటించినా, రోజూ మందులు వాడినా కొందరిలో షుగర్ లెవల్స్ కంట్రోల్లోకి రావు. అలాంటి వారి కోసం ప్రముఖ సిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ కామరాజ్ ఒక అద్భుతమైన, ఎవరికీ తెలియని ఇంటి వైద్య చిట్కాను వెల్లడించారు. అదే కానుగ పువ్వు పొడి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.
కానుగ చెట్టు మన సంస్కృతిలో ప్రాచీన కాలం నుంచి ఉన్న ఓ సాధారణ చెట్టు. సాధారణంగా ఈ చెట్టు నుంచి లభించే కానుగ నూనెను చర్మవ్యాధులకు, సోరియాసిస్ నివారణకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే దీని పూలు మధుమేహ రోగులకు ఒక అమృతంలా పనిచేస్తాయని సిద్ధ వైద్యం చెబుతోంది. ఇది టైప్-1, టైప్-2 అనే రెండు రకాల డయాబెటిస్‌ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
కానుగ పూలు వికసించే సీజన్లో గుత్తులుగా పూలు పూస్తాయి. వాటిని సేకరించాలి. మట్టి, దుమ్ము లేకుండా ఆ పూలను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత వాటిని నీడలోనే పూర్తిగా ఆరబెట్టాలి.
బాగా ఎండిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసి, గాలిచొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఈ కానుగ పూవు పొడిని ప్రతిరోజూ ఉదయం పూట 5 గ్రాములు, అలాగే సాయంత్రం పూట 5 గ్రాముల చొప్పున గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి. ఈ మిశ్రమాన్ని ఆహారానికి సుమారు అర గంట ముందే తీసుకోవడం మంచిది.
ఈ పద్ధతిని క్రమం తప్పకుండా 3 నుంచి 6 నెలల పాటు పాటిస్తూ వస్తే, ఎంతగానో పెరిగిన బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా క్రమంగా తగ్గి సాధారణ స్థాయికి వస్తాయని డాక్టర్ కామరాజ్ సూచిస్తున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే ఈ సహజ సిద్ధమైన ఔషధం మధుమేహ బాధితులకు గొప్ప వరంలాంటిది.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..