
వర్షాకాలం లేదా చలికాలం వచ్చిందంటే చాలు.. ఇంట్లోకి దోమలు, బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు విపరీతంగా వచ్చి చేరుతుంటాయి. వీటిని వదిలించుకోవడానికి మనం మార్కెట్లో లభించే రసాయన స్ప్రేలు, కాయిల్స్ వాడుతుంటాం. అయితే ఇవి మన ఆరోగ్యానికి, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు లేదా ఆస్తమా ఉన్నవారికి తీవ్ర హాని కలిగిస్తాయి. వీటికి బదులుగా మన పూజా గదిలో ఉండే కర్పూరాన్ని వాడి ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.
దోమల నివారణ: గదిలో దోమలు ఎక్కువగా ఉంటే, కిటికీలు మరియు తలుపులు మూసివేసి ఒక చిన్న గిన్నెలో కర్పూరాన్ని వెలిగించాలి. ఒక 15 నిమిషాల తర్వాత తలుపులు తెరిస్తే, కర్పూరం నుంచి వెలువడే గాఢమైన వాసనకు దోమలు పారిపోతాయి. ఇది కాకుండా, ఒక పాత్రలోని నీటిలో కర్పూరం బిళ్ళలు వేసి గది మూలల్లో ఉంచినా మంచి ఫలితం ఉంటుంది.
బొద్దింకల బెడద: కిచెన్ సింక్ కింద లేదా అలమరాల్లో బొద్దింకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. కర్పూరాన్ని పొడి చేసి, కొంచెం నీటిలో కలిపి ఆ ప్రాంతాల్లో స్ప్రే చేయాలి. బొద్దింకలకు కర్పూరం ఘాటైన వాసన పడదు కాబట్టి, అవి ఆ ప్రాంతానికి మళ్లీ రావు.
బట్టల సంరక్షణ: అలమరాల్లో ఉంచిన బట్టలు కొన్ని రోజుల తర్వాత దుర్వాసన వస్తుంటాయి లేదా చిన్న చిన్న పురుగులు పడుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే, బట్టల మధ్యలో చిన్న కర్పూరం బిళ్ళలను ఒక పల్చని గుడ్డలో చుట్టి ఉంచాలి. దీనివల్ల బట్టలు సువాసనతో ఉండటమే కాకుండా పురుగులు పట్టకుండా ఉంటాయి.
నల్లుల నివారణ: మంచం లేదా సోఫాలలో నల్లుల సమస్య ఉంటే, కర్పూరాన్ని నీటిలో కలిపి ఆ నీటిని మంచం కోళ్లకు, పగుళ్లలో చల్లాలి.
గదిలో 15 నిమిషాలు కర్పూరం వెలిగించడం వల్ల వెలువడే గాఢమైన వాసనకు దోమలు పారిపోతాయి. కర్పూరం నీటిని సింక్, మూలల్లో స్ప్రే చేయడం వల్ల బొద్దింకల సంచారాన్ని అరికడుతుంది. బట్టల్లో పురుగులుపల్చని గుడ్డలో కర్పూరం చుట్టి అలమరాల్లో ఉంచడం వల్ల బట్టలు సువాసనగా ఉండి పురుగులు పట్టవు.
అయితే, ఇక్కడ పాటించాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. కర్పూరాన్ని వాడేటప్పుడు అది చిన్న పిల్లలకు, పెంపుడు జంతువులకు అందకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది త్వరగా మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఖరీదైన రసాయనాల జోలికి వెళ్లకుండా సహజసిద్ధమైన ఈ పద్ధతిని పాటించడం వల్ల అటు ఆరోగ్యాన్ని, ఇటు ఇంటి పరిశుభ్రతను కాపాడుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..