మనీ ప్లాంట్ వాస్తు రహస్యం ఇదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు

మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచుకోవడం వాస్తు శాస్త్రం ప్రకారం శుభప్రదంగా భావిస్తారు. ఇది కేవలం అలంకార మొక్క మాత్రమే కాకుండా, సానుకూల శక్తిని పెంచి, ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుందని నమ్ముతారు. సాధారణ మనీ ప్లాంట్‌తో పాటు ఫెంగ్‌షు వెదురు బొంగులతో కూడిన మనీ ప్లాంట్లు కూడా ధనవృద్ధి, శ్రేయస్సుకు ప్రతీకలుగా పరిగణిస్తారు..

మనీ ప్లాంట్ వాస్తు రహస్యం ఇదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు
Money Plant Vastu

Updated on: Jul 15, 2026 | 1:08 PM

ఆధ్యాత్మిక ప్రయాణంలో మన పూర్వీకులు కొన్ని వస్తువులకు, చిహ్నాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయాలు కేవలం ఆచారాలు మాత్రమే కావు, వాటి వెనుక ఒక శాస్త్రీయ విశేషం కూడా ఉంది. మన ఇంట్లో కొన్ని సింబల్స్ లేదా వస్తువులు ఉంచడం ద్వారా జీవితంలో గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉందని పెద్దలు చెబుతుంటారు. అవి ధనానికి అనుకూలమైన ఫలితాలను అందించడమే కాకుండా, ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తగ్గించి, సానుకూల శక్తిని పెంపొందిస్తాయి. సనాతన ధర్మంలోని ఇటువంటి సంస్కృతి, సంప్రదాయాలను పాటించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు, పండితులు పేర్కొంటున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం.. మనీప్లాంట్ ఇంట్లో పెంచుకోవడం శుభప్రదం.. అలాగే, ఇది ఇంటికి అలంకారంగా ఉండటంతోపాటు అనుకూలశక్తిని ఇస్తుంది. ఈ కథనంలో మనీ ప్లాంట్ ఇంటికి ధనాన్ని, శుభాన్ని ఎలా ఆకర్షిస్తుంది..? పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

మనీ ప్లాంట్ ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం ఒక అలంకార మొక్క మాత్రమే కాదు, వాస్తు, ఫెంగ్‌షు సూత్రాల ప్రకారం ధనవృద్ధికి, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. మనీ ప్లాంట్లు ప్రధానంగా రెండు రకాలుగా లభ్యమవుతాయి.. రెండూ కూడా మంచి ఫలితాలను అందించగలవని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

మొదటి రకం, మనం సాధారణంగా కుండీలలో పెంచుకునే మనీ ప్లాంట్లు. ఇవి ఇంట్లో వేగంగా వ్యాప్తి చెందుతూ, పచ్చదనంతో నిండి ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల ధనానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఇంట్లో సానుకూల వైబ్రేషన్లను పెంచి, మంచి ఫలితాలను ఇవ్వడానికి తోడ్పడుతుంది. ఇంట్లో ఎక్కడైనా ప్రతికూల శక్తి ఉన్నా, ఈ చెట్టు దానిని సమర్థవంతంగా తగ్గించి, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలదని నమ్ముతారు. మొక్కలు పచ్చగా, ఆరోగ్యంగా ఉండటం వల్ల ఇంటిల్లిపాదికీ మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చేకూరుతాయి.

రెండవ రకం, ఫెంగ్‌షు వెదురు బొంగులతో కూడిన మనీ ప్లాంట్లు (Feng Shui Bamboos). ఇవి మార్కెట్లో సులభంగా లభిస్తాయి. చాలా మంది వీటిని తమ ఇళ్లలో లేదా కార్యాలయాల్లోని టేబుళ్ల మీద ఉంచుకుంటారు. ఈ రకమైన మనీ ప్లాంట్ కూడా ప్రతికూల వైబ్రేషన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని ఉనికి ఇంట్లో సానుకూల శక్తిని పెంచి, అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా, ధనపరమైన విషయాలలో విజయం సాధించడానికి, ఆర్థికంగా మెరుగుదల ఉండటానికి ఇవి దోహదపడతాయి. వెదురు బొంగులు సాధారణంగా బలం, సౌభాగ్యం, దీర్ఘాయుష్షుకు చిహ్నంగా ఉంటాయి, కాబట్టి వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆ శుభాలు కూడా కలుగుతాయని పేర్కొంటున్నారు.

మనీ ప్లాంట్‌ను ఈ దిశలో ఉంచండి..

మనీ ప్లాంట్‌ను సరైన దిశలో, సరైన స్థలంలో ఉంచడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. వాస్తు నియమాలను అనుసరించి, మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో ఉంచడం శ్రేయస్కరమని చాలా మంది నమ్ముతారు. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందని, డబ్బు ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని చెబుతారు. మనీ ప్లాంట్ అనేది ఆర్థిక లాభాలను పెంచడమే కాకుండా, ఇంట్లో ప్రశాంతతను, శ్రేయస్సును కూడా అందిస్తుంది. కాబట్టి, మనీ ప్లాంట్ ఏ రూపంలో ఉన్నా, దానిని జాగ్రత్తగా ఇంట్లో పెంచుకోవడం ద్వారా మంచి ఫలితాలు, విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఒక మొక్క కాదు, సంపద, సానుకూలతలకు ప్రతీక అని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

(Disclaimer: ఈ వివరాలు హిందూ ధర్మశాస్త్రాలు, పురాణాలు, సంప్రదాయ విశ్వాసాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని ఆధ్యాత్మిక విశ్వాసాలుగా మాత్రమే పరిగణించాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us