Chicken Dum Biryani: రెస్టారెంట్ స్టైల్‌లో బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ తయారీ.. టెస్ట్‌ అదిరిపొద్ది.. తిన్నారంటే చాలు మైమరచిపోతారు!

Chicken Dum Biryani: బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ తయారీ అద్భుతమైన ఒక సమగ్ర రెసిపీని అందిస్తున్నాము. రెస్టారెంట్ రుచిని మించిపోయేలా, మసాలాలను సర్దుబాటు చేసుకుంటూ ఈ బిర్యానీని సిద్ధం చేయవచ్చు. ఒక్కసారి చేసి తిన్నరంటే చాలు మైమరచిపోతారు. టెస్ట్‌ అదిరిపొద్ది. సింపుల్‌గా తయారీ విధానం తెలుసుకుందాం..

Chicken Dum Biryani: రెస్టారెంట్ స్టైల్‌లో బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ తయారీ.. టెస్ట్‌ అదిరిపొద్ది.. తిన్నారంటే చాలు మైమరచిపోతారు!
Chicken Dum Biryani

Updated on: Mar 31, 2026 | 11:00 AM

Chicken Dum Biryani: బిర్యానీ అంటే ప్రతి ఒక్కరు లొట్టలేసుకుని ఆరగిస్తుంటారు. బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని చేశారంటే అదిరిపొద్ది. సాధారణంగా రెస్టారెంట్లలో లభించే చికెన్ దమ్ బిర్యానీకి మించి రుచిని అందించేలా ఈ రెసిపీని అందిస్తున్నారు చెఫ్‌లు. ఈ విధానంలో చికెన్ ముక్కలు రబ్బరులా మారడం లేదా సక్రమంగా ఉడకకపోవడం వంటి సమస్యలు ఎదురుకావని, సరైన కొలతలు, చిట్కాలను పాటిస్తే అద్భుతమైన రుచి లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా తెలుగు ప్రజల అభిరుచికి అనుగుణంగా దీనిని తయారు చేశారు. ఈ రెసీపికి సంబంధించిన చెఫ్‌లు తెలిపిన వివరాల  ద్వారా అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే ఫుడ్‌కు సంబంధించి వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు.

సింపుల్‌గా తయారీ విధానం:

ఇవి కూడా చదవండి
  • ముందుగా అరకిలో బోన్లెస్ చికెన్‌ను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలిపిన నీటిలో గంటపాటు నానబెట్టాలి. ఈ ప్రక్రియ చికెన్ సాఫ్ట్‌గా మారడానికి సహాయపడుతుంది.
  • ఆ తర్వాత చికెన్‌కు కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, పసుపు, కారం, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మసాజ్ చేయాలి. కావాలంటే ఈ మసాలాలతో కలిపిన చికెన్‌ను రెండు మూడు గంటలు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు.
  • తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ మైదా పిండిని కొద్దిగా నీటితో కలిపి చికెన్‌కు పూతలా వేయాలి. కార్న్‌ఫ్లోర్ లేనివారు బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు.
  • ఈ చికెన్ ముక్కలను వేడి నూనెలో మీడియం ఫ్లేమ్‌లో ఎర్రగా, క్రిస్పీగా మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. పిండి పూత జారిపోకుండా జాగ్రత్త వహించాలి.
  • తరువాత పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడిచేయాలి.
  • ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర, రెండు పచ్చిమిర్చి, మూడు వెల్లుల్లి తరుగు వేసి హై ఫ్లేమ్‌లో టాస్ చేయాలి.
  • దీనికి రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన ఉల్లిపాయలు, రెండు రెబ్బల కరివేపాకు వేసి ఎర్రగా వేపాలి.
  • తర్వాత రెండు టేబుల్ స్పూన్ల టొమాటో తరుగు (లేదా ఒక టీ స్పూన్ టొమాటో కెచప్) వేసి మగ్గనివ్వాలి.
  • ఒకటిన్నర టీ స్పూన్ల కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హై ఫ్లేమ్‌లో బాగా రోస్ట్ చేయాలి.
  • మసాలాలు బాగా వేగిన తర్వాత అర కప్పు చిలికిన పెరుగును మంట తగ్గించి వేసి కలపాలి.
  • ఆ తర్వాత వేయించిన బోన్లెస్ చికెన్‌ను వేసి హై ఫ్లేమ్‌లో బాగా కలిపి మసాలా పట్టించాలి.
  • 50ml నీరు, నాలుగు ఐదు చుక్కల రెడ్ ఫుడ్ కలర్ (ఐచ్ఛికం) వేసి హై ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి.
  • కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసి ఫ్రై చేసి, గ్రేవీ నుండి నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, అరచెక్క నిమ్మరసం పిండి దింపేయాలి.

ఇది కూడా చదవండి: Bear Attack: అడవిలో ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలి? ఇలా అస్సలు చేయకండి.. ప్రాణాలను కాపాడుకునే మార్గాలివే!

ఇక బిర్యానీ రైస్ కోసం..

  • ఇక బిర్యానీ రైస్ కోసం రెండున్నర లీటర్ల నీటిని మరిగించాలి.
  • మసాలాలు ఎక్కువగా కావాలంటే వాడుకోవచ్చు. తగ్గించాలనుకుంటే తగ్గించుకోవచ్చు.
  • నీటిలో మూడు అనాసపువ్వులు, మూడు నాలుగు మరాఠీ మొగ్గలు, ఒక టీ స్పూన్ షాహీ జీరా, నాలుగైదు లవంగాలు, ఆరేడు దంచిన యాలకులు, మూడు బిర్యానీ ఆకులు, చిన్న జాపత్రి, రెండు అంగుళాల దాల్చిన చెక్క, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు వేసి బాగా మరగనివ్వాలి.
  • నీరు మరుగుతున్నప్పుడు ఒకన్నర కప్పులు (275 గ్రాములు) గంటపాటు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి హై ఫ్లేమ్‌లో 60% ఉడకనివ్వాలి.
  • దమ్ కోసం అడుగు మందంగా ఉన్న గిన్నెలో 60% ఉడికిన అన్నాన్ని ఒక పొరగా వేయాలి.
  • మూడు నిమిషాల తర్వాత 70% ఉడికిన అన్నాన్ని మరో పొరగా వేయాలి.
  • ఆపై సిద్ధం చేసుకున్న చికెన్ గ్రేవీని ఒక పొరగా వేయాలి. చికెన్ డ్రైగా అనిపిస్తే 50ml మరుగుతున్న నీటిని వేసుకోవచ్చు.
  • మరో రెండు నిమిషాల తర్వాత 80% ఉడికిన అన్నాన్ని చివరి పొరగా వేయాలి.
  • ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల నూనెను గిన్నె అంచుల వెంబడి అన్నంపై పోయాలి.
  • ఒక టేబుల్ స్పూన్ వేయించిన ఉల్లిపాయలు (ఐచ్ఛికం). అర టీ స్పూన్ యాలకుల పొడి వేయాలి.
  • ఆ తర్వాత అర కప్పు (125ml) మరుగుతున్న నీటిని గిన్నె అంచుల్లో పోయాలి.
  • టిష్యూ నాప్‌కిన్స్, అరిటాకు లేదా మైదా పిండి ముద్దతో గిన్నె అంచులను మూతతో సీల్ చేసి దమ్ చేయాలి.
  • టిష్యూ నాప్‌కిన్స్ ఉపయోగిస్తే కొద్దిగా నీళ్లు చల్లాలి. ఈ బిర్యానీని 15 నిమిషాల పాటు దమ్ చేయాలి.
  • 8 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, 7 నిమిషాలు లో ఫ్లేమ్‌లో
  • దమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, 15 నిమిషాలు విశ్రాంతినివ్వాలి.
  • అరగంట తర్వాత అట్లకాడతో అడుగు నుండి కలపాలి. ఈ రెసిపీలో మసాలాల స్థాయిని వ్యక్తిగత అభిరుచికి తగ్గట్టుగా సర్దుబాటు చేసుకోవచ్చని సూచించారు.

Bathroom Vastu Tips: బాత్రూంలో ఉప్పు పెడితే డబ్బులే డబ్బులు.. వాస్తు శాస్త్ర రహస్యాలివే..!

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us