Fish Cooking Tips: నోట్లో పెట్టుకుంటే కరిగిపోవలసిందే..! చేపల కూర ఇలా వండితే.. ముక్క మెత్తగా.. యమా రుచిగా..

Fish Cooking Tips: మీరు వండే చేప ముక్కలు సాఫ్ట్‌గా రావాలంటే.. తాజా చేపలను ఎంచుకోవడం, సరైన మ్యారినేషన్ చేయడం, ఓవర్ కుకింగ్ (ఎక్కువ సేపు వండటం) చేయకపోవడం చాలా ముఖ్యం. ఈ చిన్న చిన్న కిచెన్ టిప్స్ పాటిస్తే.. మీరు ఇంట్లో..

Fish Cooking Tips: నోట్లో పెట్టుకుంటే కరిగిపోవలసిందే..! చేపల కూర ఇలా వండితే.. ముక్క మెత్తగా.. యమా రుచిగా..
Fish Cooking Tip

Updated on: May 17, 2026 | 10:46 AM

Fish Cooking Tips: ఇంట్లో చేపల కూర లేదా ఫ్రై చేసేటప్పుడు చాలా మందికి వచ్చే పెద్ద సమస్య ఏంటంటే.. వండిన తర్వాత చేప ముక్కలు సాఫ్ట్‌గా, జూసీగా ఉండకపోవడం. హోటల్స్ లేదా రెస్టారెంట్లలో దొరికే ఫిష్ నోట్లో పెట్టగానే కరిగిపోయేలా ఉంటే, ఇంట్లో చేసినవి మాత్రం కొన్నిసార్లు రబ్బర్‌లా గట్టిగా తయారవుతాయి. దీనికి ప్రధాన కారణం తప్పుడు మ్యారినేషన్ (Marination), అవసరానికి మించి ఎక్కువ సేపు ఉడికించడం. చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయి. అందుకే వండేటప్పుడు చేసే చిన్న తప్పు కూడా వాటి టెక్స్చర్‌ను పాడు చేస్తుంది. చేపలు పర్‌ఫెక్ట్‌గా రావడానికి సరైన పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం..

నిమ్మరసం, పెరుగు మ్యారినేషన్‌తో అద్భుతమైన రిజల్ట్

చేప ముక్కలు లోపల వరకు సాఫ్ట్‌గా, టేస్టీగా ఉండాలంటే వండడానికి ముందు వాటిని సరైన పద్ధతిలో మ్యారినేట్ చేయడం చాలా అవసరం. చాలా మంది చెఫ్‌లు చేప ముక్కలకు కొద్దిగా నిమ్మరసం, పెరుగు రాయాలని చెప్తుంటారు. పెరుగు చేప ముక్కలను సాఫ్ట్‌గా ఉంచడానికి సహాయపడితే.. నిమ్మరసం నీచు వాసనను తగ్గించి ఫ్లేవర్‌ను పెంచుతుంది. ఇందుకోసం చేప ముక్కలకు ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం-వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం పట్టించి 20 నుండి 30 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. దీనివల్ల మసాలాలు లోపలికి వెళ్లి చేపలు చాలా సాఫ్ట్‌గా తయారవుతాయి.

ఎక్కువ సేపు వండడమే పెద్ద తప్పు

ఎక్కువ సేపు ఉడికిస్తే లేదా ఫ్రై చేస్తే చేపలు బాగా అవుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఇదే అతిపెద్ద తప్పు. చేపలను అవసరానికి మించి ఎక్కువ సేపు ఫ్రై చేసినా లేదా ఉడికించినా వాటిలోని తేమ ఆవిరైపోయి ముక్కలు గట్టిగా మారిపోతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చేపలను మీడియం ఫ్లేమ్‌పై తక్కువ సమయం మాత్రమే వండాలి. ఒకవేళ ఫిష్ ఫ్రై చేస్తుంటే, ప్రతి వైపు కేవలం కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఫ్రై చేయండి. అలాగే చేపల పులుసు చేసేటప్పుడు కూడా ఎక్కువ సేపు మరిగించకూడదు.

ఇవి కూడా చదవండి

ఆవనూనె, తక్కువ మంటతో చేసే దేశీ పద్ధతి

చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ చేపలను ఆవనూనెలో (Mustard Oil) వండుతుంటారు. దీనివల్ల రుచి, టెక్స్చర్ రెండూ బాగుంటాయి. ముఖ్యంగా బెంగాలీ, తూర్పు భారతీయ వంటకాల్లో చేపలను తక్కువ మంటపై నెమ్మదిగా ఉడికించే పద్ధతిని పాటిస్తారు. దీనివల్ల చేప ముక్కలు విరిగిపోకుండా, చాలా మెత్తగా ఉంటాయి.

ఫ్రీజర్ నుండి తీసిన వెంటనే వండకండి

చాలా మంది చేసే మరో సాధారణ తప్పు ఏంటంటే.. ఫ్రీజర్ నుండి తీసిన వెంటనే చేపలను వండటం ప్రారంభిస్తారు. బాగా చల్లగా ఉన్న చేపలను నేరుగా వేడి నూనెలో వేస్తే వాటి టెక్స్చర్ పాడైపోతుంది. అందుకే ఫ్రీజర్ నుండి తీసిన తర్వాత చేపలను కొంతసేపు రూమ్ టెంపరేచర్‌కు వచ్చే వరకు బయట ఉంచాలి. ఆ తర్వాతే మ్యారినేట్ చేసి వండటం మంచిది.

చిన్న చిన్న టిప్స్.. అద్భుతమైన రుచి

మీరు వండే చేప ముక్కలు సాఫ్ట్‌గా రావాలంటే.. తాజా చేపలను ఎంచుకోవడం, సరైన మ్యారినేషన్ చేయడం, ఓవర్ కుకింగ్ (ఎక్కువ సేపు వండటం) చేయకపోవడం చాలా ముఖ్యం. ఈ చిన్న చిన్న కిచెన్ టిప్స్ పాటిస్తే.. మీరు ఇంట్లో చేసే ఫిష్ వంటకాలు కూడా రెస్టారెంట్ స్టైల్ రుచిని, సాఫ్ట్‌నెస్‌ను సొంతం చేసుకుంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us