Antarctic Expedition: అనారోగ్యమే ఆమెకు సలాం కొట్టింది.. చరిత్ర సృష్టించిన హైదరాబాద్ మహిళ

Sneha B Raju: వైద్య సవాళ్లను ధైర్యంతో ఎదుర్కొని సాహసానికి కొత్త నిర్వచనం ఇచ్చారు 34 ఏళ్ల శ్నేహ బి. రాజు (Sneha B Raju). రెండు కిడ్నీల ట్రాన్స్‌ప్లాంట్‌ తర్వాత పూర్తి ఆంటార్కిటికా సాహస యాత్ర(Antarctic Expedition)ను విజయవంతంగా పూర్తి చేసిన ప్రపంచంలో తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.

Antarctic Expedition: అనారోగ్యమే ఆమెకు సలాం కొట్టింది.. చరిత్ర సృష్టించిన హైదరాబాద్ మహిళ
Hyderabad Woman

Updated on: Feb 03, 2026 | 12:18 PM

ఒక వ్యక్తికి రెండు కిడ్నీలు ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే చిన్న విషయం కాదు. ఒక కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటేనే చాలా మంది తరచూ అలసిపోతుంటారు. ఇక, రెండు కిడ్నీలు చేసి సాహస యాత్రలు చేయడంటే అది మామూలు విషయం కాదు. అలాంటి సాహసమే చేసింది హైదరాబాద్ నగరానికి చెందని మహిళ. ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైద్య సవాళ్లను ధైర్యంతో ఎదుర్కొని సాహసానికి కొత్త నిర్వచనం ఇచ్చారు 34 ఏళ్ల శ్నేహ బి. రాజు (Sneha B Raju). రెండు కిడ్నీల ట్రాన్స్‌ప్లాంట్‌ తర్వాత పూర్తి ఆంటార్కిటికా సాహస యాత్ర(Antarctic Expedition)ను విజయవంతంగా పూర్తి చేసిన ప్రపంచంలో తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ఆమె ఆంటార్క్టిక్ ఖండంలో రాత్రి శిబిరం ఏర్పాటు చేయడం, ఆంటార్క్టిక్ సర్కిల్ దాటడం వంటి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంది.

అంటార్కిటికా ఎక్స్‌పెడిషన్..

అంటార్కిటికా ఎక్స్‌పెడిషన్ డిసెంబర్ 17–28, 2025 వరకు జరిగింది. యాత్ర అర్జెంటీనా, ఉషుయా నుంచి ప్రారంభమై.. కఠినమైన డ్రేక్ ప్యాసేజ్ దాటుతూ ఆంటార్క్టిక్ పెనిన్సులాకు చేరింది. ఖండంలో ల్యాండింగ్‌లు, రాత్రి శిబిరం ఏర్పాటు, అంటార్కిటికా సర్కిల్ దాటడం వంటి సవాళ్లు ఆమె ముందుకు సాగడంలో కీలక పాత్ర పోషించాయి.

శ్నేహ మొదట బారెంటియోస్ ఐలాండ్ వద్దకు చేరింది. ఆ తర్వాత పోర్టల్ పాయింట్లో అధికారిక ల్యాండింగ్ చేసి రాత్రి శిబిరంలో విశ్రాంతి తీసుకుంది. చివరగా డీటైల్ ఐలాండ్‌పై అడుగుపెట్టి, అంటార్క్టిక్ సర్కిల్ దాటిన సందర్భంగా తన సాహస యాత్రలో ఒక మైలురాయిని చేరుకుంది.

శ్నేహ సరికొత్త రికార్డులు

శ్నేహ జీవిత కథ నిజంగా స్ఫూర్తిదాయకం. 3 ఏళ్ల వయసులో క్రానిక్ కిడ్నీ వ్యాధితో బాధపడిన ఆమె ఏడేళ్ల వయసులో మొదటి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది. 2013లో కళాశాల చివరి సంవత్సరంలో మలేరియా కారణంగా మొదటి కిడ్నీ సమస్యలు ఏర్పడి, రెండవ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని, ఆమె ఎక్స్‌ట్రీమ్ ట్రెక్కింగ్, మౌంటైన్ క్లైంబింగ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది.

ప్రస్తుతం శ్నేహ హైదరాబాద్‌లోని ఎన్సీసీ లిమిటెడ్‌లో డిప్యూటీ హెడ్ ఆఫ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్.. కొనసాగుతున్నారు. ఆర్గన్ డొనేషన్, సమానత్వం కోసం అవగాహన పెంచుతోంది. ఆమె విజయంతో అవయవాల ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్న వారికి మాత్రమే కాక.. ప్రతి ఒక్కరి ధైర్యానికి పరిమితులు లేవని సాక్ష్యంగా చూపింది. ఆమె జీవితం చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.