
40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో కొన్ని సహజమైన మార్పులు మొదలవుతాయి. వయసుతో పాటు కండరాల బరువు క్రమంగా తగ్గుతుంది.ఎముకలు బలహీనపడం స్టార్ట్ అవుతుంది. మెటబాలిజం మందగించి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. అయితే, వయసు పెరిగే కొద్దీ శరీరానికి అవసరమైన వ్యాయామాలను ఎంచుకోవాలి. డైలీ వర్కౌట్స్ చేయడం వల్ల ఆనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. కాబట్టి 40 ఏళ్ల వయస్సు తర్వాత మీ డైలీ రోటీన్‌లో చేర్చుకోవడానికి ఏ వ్యాయామాలు ప్రయోజనకరంగా ఉంటాయో తెలుసుకుందాం.
40 ఏళ్ల వయస్సు తర్వాత ఏ వ్యాయామాలు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం.. గుండె ఆరోగ్యం, కండరాలు, ఎముకల బలాన్ని పెంచే వ్యాయామాలపై దృష్టి పెట్టాలి.
కార్డియో వ్యాయామాలు : వేగంగా నడవడం కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే సైక్లింగ్, ఈత పడపడం వల్ల శరీరానికి మంచి శక్తిని, ఓర్పు లభిస్తుంది
స్ట్రెంగ్త్ ట్రైనింగ్ : కండరాల బలం కోసం తేలికపాటి బరువులు ఎత్తడం లేదా రెసిస్టెన్స్ బాండ్స్ ఉపయోగించడం మంచిది. ఇలా చేయడం వల్ల కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి.
యోగా, స్ట్రెచింగ్: శరీర ప్లెక్స్‌బులిటీని పెంచడానికి, నడుము, కీళ్ల నొప్పులను నివారించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
వ్యాయామం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.