జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో బాడీ మొత్తం కూల్‌ కూల్‌

Ragi Ambali Recipe: సమ్మర్ వచ్చింది.. బయట ఎండులు దంచికొడుతున్నాయి. ఈ ఎండల నుంచి ఉపశమనం పొందాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. మన బాడీను కూల్‌ చేయడంలో మన ముత్తాతల నుంచి తీసుకుంటున్న ఆహారం రాగి అంబలి. ఇది వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉండంలో ఎంతో బాగా పని చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.కాబట్టి దీన్ని ఇంట్లోనూ సింపుల్‌గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి.

జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో బాడీ మొత్తం కూల్‌ కూల్‌
Ragi Ambali Recipe

Updated on: Apr 11, 2026 | 10:10 AM

చాలా మంది రాగి అంబలిని జస్ట్ రాగి పిండి ఒక్కటే కలిపి చేసుకుంటారు. కానీ దానికి కొంచెం పెరుగు, ఉల్లిపాయ, కొత్తిమీర యాడ్ చేసి తయారు చేస్తే టేస్ట్ అదిరిపోతుంది అంతే.. రాగి పిండితో పాటు పెరుగు కూడా శరీరాన్ని చల్లబరిలే తత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సమ్మర్‌లో ఇలా రాగి అంబలి తయారు చేసుకొని తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి రాగి అంబటి తయారీకి ఏం ఏం కావాలి, ఎలా తయారు చేయాలో చూద్దాం.

రాగి అంబలి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు!

  • రాగి పిండి: 2-3 టేబుల్ స్పూన్లు
  • నీళ్లు: 2 కప్పులు
  • చిక్కటి పెరుగు: 1 కప్పు
  • ఉప్పు: రుచికి సరిపడా
  • ఉల్లిపాయ: సగం సన్నగా తరిగింది
  • కొత్తిమీర: కొద్దిగా
  • పచ్చిమిర్చి: సన్నగా తరిగినది ఒకటి
  • జీలకర్ర: కొద్దిగా

తాలింపు కోసం:

  • నూనె: 1 టీస్పూన్
  • ఆవాలు: కొద్దిగా
  • కరివేపాకు: ఒక రెమ్మ
  • ఇంగువ: చిటికెడు

రాగి అంబలిని ఎలా తయారు చేయాలి !

  • ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని, అందులో అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి.
  • మరో పాత్రలో మిగిలిన 1½ కప్పుల నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, ముందుగా కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని అందులో పోస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి.
  • ఈ మిశ్రమం చిక్కబడి, ఉడికే వరకు సుమారు 5-8 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసి కలపాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆపేసి, ఈ రాగి జావను పూర్తిగా చల్లారనివ్వాలి.
  • జావ పూర్తిగా చల్లారిన తర్వాత, అందులో మజ్జిగ పోసి బాగా కలపాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. వేడిగా ఉన్నప్పుడు మజ్జిగ కలిపితే విరిగిపోయే అవకాశం ఉంది
  • తర్వాత ఒక చిన్న బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు వేయాలి. ఈ తాలింపును అంబలిలో పోసి బాగా కలుపుకోవాలి.
  • మీకు అంబలి మరీ చిక్కగా అనిపిస్తే, మరికొన్ని నీళ్లు లేదా మజ్జిగ కలిపి మీకు నచ్చిన విధంగా పల్చగా చేసుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో ఇది తాగితే ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటుంది

( Note: పైర పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అందించబడినవి.. వీటిని Tv9 దీవీకరించడం లేదు)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us