జస్ట్ 10 మినెట్స్.. నూనె లేకుండానే కరకరలాగే రాగి చిప్స్‌.. ఇలా చేసి తింటే ఆహా అనాల్సిందే!

Ragi Chips Recipe: సాయంత్రం అయిందంటే చాలా ఆఫీస్‌లో ఉన్న, ఇంటి దగ్గర ఉన్న.. ఏవైనా స్నాక్స్ తినాలి అనిపిస్తుంది. దీంతో చాలా మంది ఆలూ చిప్స్, టీ, మిర్చీ బజ్జీలు వంటిని తినేందుకు ఇష్టపడుతారు. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. కాబట్టి టేస్ట్‌కు టేస్ట్‌ ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే రాగి చిప్స్‌ను ఒక్కసారి ఈవినింగ్స్ స్నాక్స్‌లోకి ట్రై చేస్తే.. మళ్లీ మళ్లీ అవే కావాలంటారు.

జస్ట్ 10 మినెట్స్.. నూనె లేకుండానే కరకరలాగే రాగి చిప్స్‌.. ఇలా చేసి తింటే ఆహా అనాల్సిందే!
Ragi Chips Recipe

Updated on: Apr 15, 2026 | 7:00 AM

మీరు స్నాక్స్‌లో ఏదైనా హెల్తీగా, టేస్టీగా ట్రై చేయాలనుకుంటే రాగి చిప్స్ ఒక అద్భుతమైన ఆప్షన్. సాయంత్రం టీ తాగేటప్పుడు ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలనిపిస్తే, బయట దొరికే చిప్స్ కంటే ఇంట్లోనే తక్కువ సమయంలో చేసుకునే ఈ రాగి చిప్స్ చాలా బెటర్. వీటిలో ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోల్పడతాయి. వీటిని తయారు చేసుకునేందుకు మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సమయంలోనే ఇంట్లో ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. అదెలానో స్టెప్‌ బై స్టెప్ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

  • రాగి పిండి: 1 కప్పు
  • గోధుమ పిండి: ½ కప్పు
  • నూనె: 2 చెంచాలు
  • కారం: 1 చెంచా
  • పెరుగు: 1 చెంచా
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 చెంచా
  • ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం:

రాగి చిప్స్‌ తయారు చేసుకునేందుకు మొదట ఒక గిన్నె తీసుకొని అందులో రాగి పిండి, గోధుమ పిండి, పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేయండి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. తర్వాత ఓవెన్‌ను 180°C దగ్గర ప్రీ-హీట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీ కర్రతో వీలైనంత పల్చగా వత్తుకోవాలి. వత్తుకున్న పిండిని మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి.

తర్వాత వాటిని బేకింగ్ ట్రేలో సర్ది, పైన కొద్దిగా నూనె రాయాలి. ఇప్పుడు ట్రేని ఓవెన్‌లో పెట్టి 12–15 నిమిషాల పాటు లేదా చిప్స్ కరకరలాడే వరకు బేక్ చేయాలి. అంతే! మీ హెల్తీ రాగి చిప్స్ రెడీ అయినట్టే. వీటిని సాస్ లేదా మీకు నచ్చిన చట్నీతో కలిపి తింటే టేస్ట్ అదిరిపోతుందంతే. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగలకుండా డబ్బాలో పెట్టుకుంటే వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us