
Rice Weevils: మన ఇంట్లో వంటగదిని అన్నపూర్ణ నిలయంగా భావిస్తాం. ముఖ్యంగా వంటింట్లో బియ్యం డబ్బా నిండుగా ఉంటే ఆ తృప్తే వేరు. అయితే, ఎంతో ఇష్టంగా దాచుకున్న బియ్యానికి పురుగులు పడితే మాత్రం మనసు చాలా బాధపడుతుంది. వంట చేయడానికి డబ్బా తీయగానే తెల్లటి బియ్యంలో నల్లటి ముక్కు పురుగులు కనిపిస్తే ప్రతి గృహిణికి చిరాకు, కంగారు రావడం సహజం. బియ్యానికి పురుగులు పట్టడం వల్ల కేవలం బియ్యం పాడవ్వడమే కాదు, అవి బియ్యంలోని సారాన్ని కూడా తినేస్తాయి. ఒక్కసారి పురుగు పట్టిందంటే బియ్యం మొత్తాన్ని పొట్టులా మార్చేస్తాయి. అలా అని వాటిని చంపడానికి మార్కెట్లో దొరికే కెమికల్స్ వాడితే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మరి ఎలాంటి రసాయనాలు వాడకుండా, మన పెద్దలు పాటించిన 3 అద్భుతమైన సహజ సిద్ధమైన చిట్కాలతో బియ్యాన్ని పురుగులు పట్టకుండా ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇది కూడా చదవండి: Fish Cooking Tips: నోట్లో పెట్టుకుంటే కరిగిపోవలసిందే..! చేపల కూర ఇలా వండితే.. ముక్క మెత్తగా.. యమా రుచిగా..
పల్లెటూళ్లలో బియ్యం ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఈ పద్ధతిని ఎక్కువగా వాడుతుంటారు. వేపాకుల్లో ఉండే అద్భుతమైన యాంటీ సెప్టిక్ గుణాలు, చేదు వాసన పురుగులను దరిచేరనివ్వవు. బాగా ఎండిన వేపాకులను ఒక కాటన్ క్లాత్‌లో (పల్చటి గుడ్డలో) మూటలా కట్టి, బియ్యం డబ్బాలో అక్కడక్కడా ఉంచాలి. బియ్యంలో నేరుగా వేపాకులు వేస్తే అన్నం కొద్దిగా చేదు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నేరుగా వేస్తే కనుక, వండే ముందు బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడగాలి.
బియ్యాన్ని పురుగుల బారిన పడకుండా కాపాడుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో రాళ్ల ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పు ఉన్న చోట పురుగులు, తేమ చేరవు. బియ్యం నిల్వ చేసేటప్పుడే అందులో కొద్దిగా రాళ్ల ఉప్పును కలిపి ఉంచాలి. ఉప్పు కలిపిన బియ్యాన్ని వండేటప్పుడు ఖచ్చితంగా రెండు సార్లు బాగా కడగాలి. లేకపోతే అన్నంలో ఉప్పు ఎక్కువైపోయే ప్రమాదం ఉంది.
మసాలా దినుసులైన బిరియానీ ఆకులు, లవంగాల ఘాటైన వాసన పురుగులకు అస్సలు పడదు. ఈ ట్రిక్ బియ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. బియ్యం క్వాంటిటీని బట్టి ఒక 5 నుండి 10 బిరియానీ ఆకులు లేదా ఒక గుప్పెడు లవంగాలను బియ్యంలో కలిపి ఉంచాలి. దీనివల్ల పురుగులు రాకపోగా, బియ్యానికి మంచి సువాసన కూడా వస్తుంది.
ఒకవేళ ఇప్పటికే పురుగులు పడితే ఏం చేయాలి?
ఇది కూడా చదవండి: Success Story: ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెలకు రూ. 7 లక్షల సంపాదన.. 19 ఏళ్ల కుర్రాడి ‘గ్లామరస్’ సక్సెస్ స్టోరీ!
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి