
ఇల్లు, వస్తువులను శుభ్రపరిచేటప్పుడు మనం నేలలు, ఫ్యాన్లు, కిటికీలు, అద్దాలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. కానీ చాలాసార్లు ఇంట్లోని లైట్ బల్బులను క్లీన్ చేయడం మర్చిపోతుంటాం. కాలక్రమేణా బల్బులపై దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. ముఖ్యంగా వంటగదిలో ఉన్న బల్బులపై వంట నూనె ఆవిరి, పొగ కారణంగా జిడ్డు లేదా క్రీజు అంటుకుంటుంది. దీనివల్ల బల్బులు మురికిగా కనిపియడమే కాకుండా, వాటి నుంచి వచ్చే కాంతి కూడా తగ్గిపోతుంది. మీ ఇంట్లోని బల్బులు కూడా ఇలాగే మసకబారితే, కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా వాటిని సరికొత్తగా మెరిపించవచ్చు. అయితే క్లీనింగ్ సమయంలో కొన్ని ముఖ్యమైన భద్రతా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవేంటో వివరంగా చూద్దాం..
బల్బ్‌ను శుభ్రం చేయడానికి ముందు మెయిన్ స్విచ్‌ను పూర్తిగా ఆఫ్ చేయండి. కరెంట్ షాక్ తగలకుండా భద్రత పాటించడం చాలా ముఖ్యం. ఎప్పుడూ వేడిగా ఉన్న బల్బ్‌ను తాకకండి. లైట్ వేసి ఉన్నప్పుడు బల్బ్ వేడెక్కుతుంది. కాబట్టి కరెంట్ ఆಫ್ చేసిన తర్వాత బల్బ్ పూర్తిగా చల్లబడే వరకు కొన్ని నిమిషాలు వేచి చూడండి. ఆ తర్వాతే దానిని హోల్డర్ నుండి సురక్షితంగా బయటకు తీయాలి.
బల్బ్పై కేవలం దుమ్ము మాత్రమే ఉంటే, దానిని శుభ్రం చేయడానికి నీరు లేదా ఎలాంటి లిక్విడ్స్ అవసరం లేదు. ఒక మృదువైన, పొడి మైక్రోఫైబర్ గుడ్డను తీసుకుని బల్బ్ పైభాగన్ని మెల్లగా తుడవాలి. దీంతో దుమ్ము సులభంగా తొలగిపోతుంది.
కిచెన్ లేదా ఇతర ప్రాంతాల్లోని బల్బులపై నూనె జిడ్డు ఉంటే, బల్బ్ తయారీదారుల సూచనలను గమనించండి. అవసరమైతే, కొద్దిగా మైల్డ్ సోప్ నీటిలో గుడ్డను ముంచి, బాగా పిండాలి. ఆ తేమతో కూడిన గుడ్డతో బల్బ్ ఉపరివిధాన్ని సున్నితంగా తుడవాలి. బల్బ్ బేస్ భాగం లేదా కరెంట్ కనెక్ట్ అయ్యే ఎలక్ట్రానిక్ భాగాలకు నీరు తగలకుండా జాగ్రత్త పడాలి. బల్బులపై నేరుగా బేకింగ్ సోడా, నిమ్మరసం లేదా వెనిగర్ వంటి ఆమ్ల పదార్థాలను పూయకండి. ఇది బల్బ్ గ్లాస్ కోటింగ్‌ను దెబ్బతీస్తుంది. బల్బ్‌ను నీటిలో ముంచడం లేదా నేరుగా నీటి స్ప్రే చేయడం చేయకూడదు.
శుభ్రం చేసిన తర్వాత బల్బ్‌లో కాస్త కూడా తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాతే తిరిగి హోల్డర్‌లో బిగించాలి. బల్బ్ పగిలిపోయినా లేదా పాతదైపోయినా శుభ్రం చేయడానికి బదులు కొత్తది మార్చడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..