మగాళ్లలో ఆ శక్తి తగ్గడానికి కారణం ఇదేనా..? ఇవి మార్చుకోకపోతే అంతే సంగతులు..

సిరి సంపదలు ఎన్ని ఉన్నా, శారీరక ఆరోగ్యానికి సాటి రావు. కానీ, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, ఒత్తిడి, బాధ్యతల మధ్య పురుషులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కేవలం బాహ్య రూపానికి ఇచ్చే ప్రాధాన్యత, అంతర్గత హార్మోన్ల సమతుల్యతపై చూపడం లేదు. పురుషులలో శక్తికి మూలమైన టెస్టోస్టెరాన్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అసలు నిజాలు ఇవే..

మగాళ్లలో ఆ శక్తి తగ్గడానికి కారణం ఇదేనా..? ఇవి మార్చుకోకపోతే అంతే సంగతులు..
How Lifestyle Affects Testosterone In Men

Updated on: Jun 25, 2026 | 10:21 PM

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సౌకర్యాలు పెరిగాయి కానీ.. ఆరోగ్యం కరువైంది. పేలవమైన జీవనశైలి, జంక్ ఫుడ్ అలవాట్లు, నిరంతర ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి పురుషులలో ఒక పెద్ద ఆరోగ్య సమస్యకు దారితీస్తున్నాయి. అదే టెస్టోస్టెరాన్ లోపం. పురుషుల శరీరంలో అత్యంత కీలకమైన ఈ హార్మోన్.. కండరాలు, ఎముకల బలాన్ని కాపాడటంలో, ఉత్సాహాన్ని నిలపడంలో, మానసిక స్థితిని నియంత్రించడంలో, సంతానోత్పత్తి మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వయసుతో పాటు ఇందులో మార్పులు రావడం సహజమే అయినా నేటి తప్పుడు అలవాట్లు వయసుతో సంబంధం లేకుండా ఈ హార్మోన్ స్థాయిలను పడిపోయేలా చేస్తున్నాయి.

టెస్టోస్టెరాన్ తగ్గితే కనిపించే లక్షణాలు..

  • శరీరంలో శక్తి లేకపోవడం, తీవ్ర అలసట.
  • కండరాల బలం తగ్గడం.
  • లైంగిక కోరికలు నశించడం.
  • చిరాకు, మానసిక స్థితిలో మార్పులు

హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే ఆ అలవాట్లు ఇవే

అమెరికన్ యూరాలజికల్ అసోసియేషన్ మార్గదర్శకాల ప్రకారం.. కేవలం లక్షణాలను బట్టే టెస్టోస్టెరాన్ లోపాన్ని నిర్ధారించలేము. కానీ క్రింది అలవాట్లు ఉన్నవారిలో ఈ హార్మోన్ స్థాయిలు వేగంగా పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

నిద్రలేమి: రోజుకు సరిపడా నిద్ర లేకపోవడం హార్మోన్ల ఉత్పత్తిని దెబ్బతీస్తుంది.

నిశ్చల జీవనశైలి: గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం.

దీర్ఘకాలిక ఒత్తిడి: మానసిక ఒత్తిడి వల్ల విడుదలయ్యే కార్టిసోల్ హార్మోన్, టెస్టోస్టెరాన్‌ను తగ్గిస్తుంది.

ఊబకాయం – తప్పుడు ఆహారం: అధిక బరువు, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం.

వ్యసనాలు: ధూమపానం, మితిమీరిన మద్యపానం.

టెస్టోస్టెరాన్ స్థాయిలను సహజంగా పెంచుకోవడం ఎలా?

పురుషులు తమ హార్మోన్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆరోగ్యకరమైన టెస్టోస్టెరాన్ స్థాయిలను నిర్వహించడానికి క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

సమతుల్య ఆహారం – వ్యాయామం: నిత్యం ప్రోటీన్లు, విటమిన్లు ఉన్న ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవాలి.

గాఢ నిద్ర: ప్రతిరోజూ రాత్రి వేళల్లో 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర అవసరం.

ఒత్తిడికి చెక్: మైండ్ రిలాక్స్ అవ్వడానికి యోగా, ధ్యానం వంటి పద్ధతులను అలవాటు చేసుకోవాలి.

వ్యసనాలకు దూరం: ధూమపానం, మద్యపానాన్ని పూర్తిగా మానేయడం లేదా నియంత్రించడం మంచిది.

Follow Us