
పెసరపప్పుతో లడ్డులు చేసి తింటే ఆరోగ్యానికి చాలా మంచివి. బెల్లం లేదా పంచదారతో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. మీ ఇంట్లోనే 15 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ , ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మరి, ఇంక లేట్ చేయకుండా వీటిని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

పెసరపప్పు లడ్డుకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు బెల్లం, నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి - 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు తీసుకోవాలి.

పెసరపప్పుతో లడ్డులు తయారీ విధానం ముందుగా పెసరపప్పును బాగా వేయించుకోవాలి: పెసరపప్పును తీసుకుని వాసన వచ్చే వరకు బాగా వేయించి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. అవి రంగు మారే వరకు మీడియం మంటపై బాగా వేయించి వాటిని ఫ్యాన్ కింద చల్లార్చాలి.

పెసరపప్పును పొడి లాగా చేసుకోవాలి: చల్లారిన పప్పును తీసుకుని మిక్సీ జార్ తీసుకుని దానిని మెత్తగా పొడిగా లాగా ఇప్పుడు అదే మిక్సీలో కొద్దిగా బెల్లం, యాలకుల పొడి కూడా వేసి బాగా తిప్పుకోవాలి. ఇవి మిక్స్ అయ్యేలా గరిటెతో కలుపుకోవాలి.

లడ్డూలు: ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, ముందుగా వేడి చేసిన నెయ్యిని దీనిలో వేసి ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసి కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి చేతికి రాసుకుని, ఆ మిశ్రమాన్ని తీసుకుని చిన్న లడ్డూలుగా చేసుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి.