Health: దోసకాయను ఇలా తీసుకోండి.. జరిగే మార్పు మాములుగా ఉండదు..

దోసకాయ ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో మంచి గుణాలు రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. అందుకే దోసకాయను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా డీహైడ్రేషన్‌ సమస్యకు దోసకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది...

Health: దోసకాయను ఇలా తీసుకోండి.. జరిగే మార్పు మాములుగా ఉండదు..
Cucumber
Follow us

|

Updated on: Jun 09, 2024 | 10:29 PM

దోసకాయ ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో మంచి గుణాలు రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. అందుకే దోసకాయను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా డీహైడ్రేషన్‌ సమస్యకు దోసకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అయితే వీటిని రెగ్యులర్‌గా పచ్చిగానే తీసుకుంటుంటాం. అయితే దోసకాయ నీటితో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ దోసకాయ నీరు.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

దోసకాయ నీటిని తయారు చేసుకోవడానికి ముందుగా దోసకాయను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత దోసకాయ పైన ఉండే తొక్కను తొలగించేయాలి. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనంతరం దోసకాయ ముక్కలను ఒక మగ్‌లో వేసి నీటిని పోయాలి. రాత్రంగా దోసకాయ ముక్కులు నీటిలో నానబెట్టాలి. అనంతరం ఉదయం లేవగానే నీటిని తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. అవేంటంటే..

* డీహైడ్రేషన్‌ సమస్యకు చెక్‌ పెట్టడంలో దోసకాయ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగానే దోసకాయాలో 70 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. దానికి తోడు రాత్రంతా నానబెట్టిన నీరు కలిసి డీహైడ్రేషన్‌ సమస్యకు చెక్‌ పెడుతుంది.

* దోసకాయ నీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో కేలరీలు సైతం తక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ-ఆక్సిడెంట్లు వంటి పోషకాలు కారణంగా బరువు త్వరగా తగ్గడంలో ఉపయోగపడుతుంది.

* గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో దోసకాయ నీరు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్, టానిన్లు, లిగ్నాన్స్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో ఉపయోగపడుతాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. దీనితో పాటు, ఇది వాపును తగ్గిస్తుంది అంతేకాకుండా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

* బీపీతో బాధపడుతున్న వారు కూడా దోసకాయ నీరు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. కుకుర్బిటాసిన్ వంటి సమ్మేళనాలు దోసకాయలో కనిపిస్తాయి, ఇవి అధిక బీపీని నియంత్రించడంలో సహాయపడతాయి.

* దోసకాయ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..