వెల్లుల్లి ఉంటే.. అనారోగ్యం పరార్..!

ఉల్లి చేసే మేలు తల్లి చేయదని ఓ సామెత..! అందులోనూ వెల్లుల్లి వల్ల ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదట. పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బ నిత్యం తింటూ ఉంటే చాలు.. అనారోగ్యమే దరిచేరదని చెబుతూంటారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ని పూర్తిగా తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తుందట. అలాగే రక్తాన్ని శుద్ధి చేయడంతో ప్రధాన పాత్రను పోషిస్తుందట. అందుకే.. కూరలు, పచ్చళ్లల్లో కూడా వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తూంటారు. తరుచూ జలుబు, జ్వరాలకు గురయ్యేవారు వెల్లుల్లి రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుందని […]

వెల్లుల్లి ఉంటే.. అనారోగ్యం పరార్..!
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2019 | 4:10 PM

ఉల్లి చేసే మేలు తల్లి చేయదని ఓ సామెత..! అందులోనూ వెల్లుల్లి వల్ల ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదట. పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బ నిత్యం తింటూ ఉంటే చాలు.. అనారోగ్యమే దరిచేరదని చెబుతూంటారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ని పూర్తిగా తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తుందట. అలాగే రక్తాన్ని శుద్ధి చేయడంతో ప్రధాన పాత్రను పోషిస్తుందట. అందుకే.. కూరలు, పచ్చళ్లల్లో కూడా వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తూంటారు. తరుచూ జలుబు, జ్వరాలకు గురయ్యేవారు వెల్లుల్లి రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుందని చెబుతూంటారు. అయితే.. దానిమీదే ఆధారపడకుండా, ఇతర వ్యాయామాలు, ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒక్క వెల్లుల్లితోనే వ్యాధులు తగ్గవని అది సహాయం మాత్రమే చేస్తుందని అంటున్నారు డాక్టర్స్.