Lifestyle: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా.? ఈ సమస్య తప్పదు..

చిన్న తనంలో తెల్ల జుట్టు సమస్య బారిన పడినవారు దీర్ఘకాలంలో పలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. తెల్ల జుట్టును సాధారణ కాస్మొటిక్‌ అంశంగా నిర్లక్ష్యం చేయొద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. జుట్టు తెల్లబడటం హృద్రోగానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు. ఇదేదో ఆషామాషీగా చెబుతోన్న....

Lifestyle: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా.? ఈ సమస్య తప్పదు..
Gray Hair
Follow us

|

Updated on: Jun 30, 2024 | 3:42 PM

జుట్టు తెల్లబడటం సర్వసాధారణమైన విషయం. ఒకప్పుడు వయసు పెరిగిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇటీవల తక్కువ వయసున్న వారిని సైతం వేధిస్తోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా తెల్ల జుట్టుతో బాధపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాతికేళ్లు కూడా నిండని వారు తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఇది చిన్న విషయంగానే భావించినా భవిష్యత్తులో పలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని నిపుణులు చెబుతున్నారు.

చిన్న తనంలో తెల్ల జుట్టు సమస్య బారిన పడినవారు దీర్ఘకాలంలో పలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. తెల్ల జుట్టును సాధారణ కాస్మొటిక్‌ అంశంగా నిర్లక్ష్యం చేయొద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. జుట్టు తెల్లబడటం హృద్రోగానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు. ఇదేదో ఆషామాషీగా చెబుతోన్న విషయం కాదు. పరిశోధనలు నిర్వహించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు.

ఈజిప్ట్‌లోని కైరో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అధ్యయనంలో భాగంగా సుమారు 600 మందిపై పరిశోధనలు నిర్వహించిన అనంతరం ఈ వివరాలను తెలిపారు. పరిశోధనలో భాగంగా వారి ఆరోగ్యం, జుట్ట రంగు ఆధారంగా పరిశీలించారు. అందరూ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. దాదాపు పదేళ్ల పాటు వీరిపై అధ్యయనం చేపట్టారు.

తెల్లజుట్టుతో ఇబ్బందిపడే వారిలో ఎక్కువ మందికి అధికరక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ ఉన్నట్లు పరిశోధనల్లో తేలిది. కాగా జుట్టు నల్లగా ఉన్నవారిలో ఈ సమస్యలు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. తెల్ల జుట్టు ఉన్న వాళ్లకు కొలెస్ట్రాల్ పెరగడం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడేవారు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..